జంపన్నవాగు బావిలో ఒకరి గల్లంతు
ములుగు, తెలంగాణ జ్యోతి : తాడ్వాయి మండలం మేడారం జంపన్నవాగు బావిలో ఓ వ్యక్తి గల్లంతైన సంఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి… ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా నూజివీడు మండ లం విస్సన్న పేటకు చెందిన అద్దంకి అంజి (35) మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల దర్శనానికి వచ్చారు. స్నానం కోసం జంపన్న వాగు మధ్యలో ఉన్న బావిలోకి ఈతకోసం దిగాడు. అంజి బావిలోకి దిగి బయటకు రాక పోవడంతో తోటి వారు వెతికారు. గంటసేపు దాటిన కనిపించక పోవడంతో బావిలోని మునిగిపోయినట్లు నిర్ధారించు కున్నారు. స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…