వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలను తనిఖీ చేసిన ఐటిడిఏ పీఓ 

వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలను తనిఖీ చేసిన ఐటిడిఏ పీఓ 

వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది : వెంకటాపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను ఐటిడిఏ పీ.ఓ అంకిత్ ఆకస్మికంగా గురువారం సాయంత్రం తనిఖీ చేసారు. గిరిజన ప్రాంతాల్లోని ఆరోగ్య సౌకర్యాలను పరిశీలించారు.సిబ్బంది హాజరు రిజిష్టర్‌ను పరిశీలించి, డ్యూటీ రిజిస్టర్ ప్రకారం సిబ్బంది అంతా అందుబాటులో ఉన్నారా, నైట్ డ్యూటీ సిబ్బంది అందుబాటులో ఉన్నారా, అత్యవసర కేసులకు హాజరయ్యేందుకు ఆసుపత్రిలో డ్రైవర్‌తో పాటు, అంబులెన్స్ అందుబాటులో ఉన్నారా తదితర అంశాలపై వైద్యాధికారి డాక్టర్ శివాజీ ని అడిగి తెలుసుకున్నారు. వార్డులను పరిశీలించి, ఇన్‌ పేషెంట్‌ల సమస్యలు, సకాలంలో చికి త్స అందించడం, రోజువారీ అవుట్‌ పేషెంట్లకు చికిత్స, మందులు సరఫరా తదితర అంశాలపై వైద్యాధికారిని అడిగి తెలుసుకుని డ్యూటీ రిజిస్టర్‌ ప్రకారం 24 గంటలూ అందుబాటులో ఉండాలని వైద్యాధికారిని ఆదేశించారు.ల్యాబొరేటరీని పరిశీలించి, సెల్ కౌంటర్ పనితీరు, రియాజెంట్ల లభ్యత, టెస్టింగ్ కిట్‌లు, రోజువారీ నిర్వహిం చే పరీక్షలు మొదలైన వాటిపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు .మరియు సెంట్రల్ డ్రగ్స్ స్టోర్‌తో సమన్వయం చేసుకుంటూ రియా జెంట్‌లు మరియు టెస్టింగ్ కిట్‌ల బఫర్ స్టాక్‌ను సరిగ్గా ఉంచుకోవా లని సిబ్బందిని ఆదేశించారు.అంబులెన్స్ డ్రైవర్‌ను 24 గంటలూ అందుబాటులో ఉండాలని, ఎలాంటి ఆలస్యం చేయకుండా అత్య వసర కేసులకు హాజరు కావాలని పి.ఓ.అంకిత్ ఆదేశించారు.