ఇఫ్తార్ విందు లో పాల్గొన్న ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు
– మత సామరస్యానికి ప్రతిక రంజాన్
– ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన శ్రీధర్ బాబు
మహాదేవపూర్, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని జామా మస్జిద్ మరియు మదీనా మసీదులో ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. అనంతరం మంత్రికి ముస్లిం సోదరులు శాలువాతో ఘనంగా సత్కరించగా, ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ముస్లిం సోదరులు మంత్రకినోరు తీపి చేశారు అలాగే ముస్లిం సోదరులకు మంత్రి నోరు తీపిని చేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా గెలుపుకు సహకరించిన ముస్లిం సోదర సోదరీమణులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. పార్లమెంటు ఎన్నికల దృశ్య ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున మైనార్టీ సంక్షేమానికి సంబంధించిన అభివృద్ధి పనులను ఎన్నికల అనంతరం పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ పవిత్ర రంజాన్ పర్వదినాన్ని అందరూ సుఖ సంతోషాలతో గడుపుకోవాలని ముందస్తుగా ప్రతి ఒక్క ముస్లిం సోదరీ సోదరీమణులకు రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.