విద్యాసంస్థల్లో సంబురాలు జరుపాలనడం అవివేకం
విద్యాసంస్థల్లో సంబురాలు జరుపాలనడం అవివేకం
– బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నాగరాజు
ములుగుప్రతినిధి:డిసెంబర్1నుంచితెలంగాణాలోనిస్కూళ్లు, కాలేజీల్లో విజయోత్సవ వేడుకలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఎందుకు వేడుకలు జరపాలో ముందు చెప్పాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాయంచు నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆది వారం ములుగులోని పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు నిదుద్యోగభృతి ఇచ్చినందుకా, ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చినందుకా, ఫీజు రీయింబర్స్మెంట్ లు ఇచ్చినం దుకా, ప్రతి మండలంలో ఇంటర్నెషనల్ స్కూల్స్ ఏర్పాటు చేసినందుకా, విద్యార్థులకు రూ.5లక్షల భరోసా కార్డు ఇచ్చి నందుకా,ఇలా మేనిఫెస్టోలో విద్యార్థుల కోసం ఇచ్చిన హామీ ల్లో ఎన్ని నెరవేర్చారని సంబురాలు జరుపుకోమంటున్నారో చెప్పాలన్నారు. ఆరు గ్యారంటీల్లో నిరుద్యోగులు, విద్యార్థు లకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీజేవైఎం జిల్లా ఉపాధ్య క్షుడు దుగ్గినేని భాను, కార్యదర్శి మహేష్, అధికార ప్రతినిధి విక్రాంత్, కార్యవర్గ సభ్యుడు ప్రశాంత్, నాయకులు దిలీప్, వంశీ తదితరులు పాల్గొన్నారు.