రేషన్ డీలర్ల కాంటాలు చెడిపోయినా పట్టింపు లేదు
– పట్టించుకోని జిల్లా కాంట్రాక్టర్ లైసెన్సు రద్దు చేయాలి
– సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్
భూపాలపల్లి జిల్లా ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : రేషన్ డీలర్ల కాంటాలు చెడి పోయినప్పటికీ సదరు కాంట్రాక్టర్ పట్టిం చుకోవడం లేదని, రేషన్ బియ్యం నిరుపేదలకు ఇవ్వడంలో ఇబ్బంది పడుతున్నారని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేషన్ డీలర్లకు అదిగితే కాంట కరాబ్ అయిపోయిందని, పలుమార్లు జిల్లా కాంట్రాక్టర్ కు తెలియజేసిన పట్టించుక పోవడం లేదంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రేషన్ తీసుకునేవారు వచ్చి మరలిపోతున్నారని, చాలా చోట్ల ఇలాంటి ఇబ్బందులే కొనసాగుతున్నాయని అన్నారు. ఏ గ్రామంలో అయితే డీలర్ల యొక్క కంప్యూటర్ కాంట కరవై పోయిందో తక్షణమే రిపేరు చేసి నిరుపేదలకు సకాలంలో రేషన్ బియ్యం అందించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. నిర్లక్ష్యం చేస్తున్న కాంటాల జిల్లా కాంట్రాక్టర్ లైసెన్స్ రద్దు చేయాలని తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. నిరుపేదలకు అందించాల్సిన బియ్యాన్ని సకాలంలో అందే విధంగా జిల్లా పౌర సరఫరాల అధికారి చర్యలు చేపట్టాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ కోరారు.