రావణాసురవధకు కేంద్రమంత్రి బండి సంజయ్ కి ఆహ్వానం
– ములుగులో జరిగే వేడుకకు రావాలని విజ్ఞప్తి
ములుగుప్రతినిధి: ములుగులో దసరా పర్వదినం సంద ర్భంగా గత 23సంవత్సరాలుగా నిర్వహిస్తున్న రావణా సురవధ ఉత్సవానికి రావాలని ఆధ్మాత్మిక వాది, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ను ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గండ్రకోట కుమార్ ఆహ్వానించారు. ఈమేరకు శనివారం కరీంనగర్ లో బండి సంజయ్ ని కలిసి ఉత్సవ కమిటీ సభ్యులు రావణాసుర వధ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రా న్ని ఆవిష్కరిం చారు.దసరా పర్వదినాన్ని పురస్కరిం చుకొని నిర్వహించే కార్యక్రమం కన్నులపండుగా జరుగు తోందని, ఫైర్ వర్క్స్, సాంస్కృతిక, జానపద కళాకారుల ప్రదర్శనలు, మిరు మిట్లు గొలిపే బాంబుల మోతల నడు మ ఉత్సవం నిర్వ హణ జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రతీ సారి ఒక వ్యక్త వచ్చి ధర్మసందేశా లను వినిపిస్తారని వెల్ల డించారు. అదేవిధంగా ఒక్కో రంగంలో సేవలు అందిం చిన ప్రముఖులకు సన్మానం చేపడుతామని, ఈ నెల12న జరిగే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై ములుగు ప్రజ లకుఆధ్మాత్మికతపై సందేశం ఇవ్వాలని కేంద్రమంత్రి బండి సంజయ్కు విన్న వించారు. అయితే దుర్గామాత దీక్ష చేప ట్టిన ఆయన దీక్ష విరమణ అనంతరం వస్తానని వారు చెప్పినట్లు కుమార్ తెలిపారు. ఈ ఆహ్వాన కార్యక్రమంలో సామా జిక వేత్త కృష్ణారెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు బైకాని ఓదెలు, మాదం కుమార్, భగవాన్ రెడ్డి, తదితరు లు పాల్గొన్నారు.