కస్తూర్బా గాంధీ పాఠశాలలో బోధనకు దరఖాస్తుల ఆహ్వానం
కస్తూర్బా గాంధీ పాఠశాలలో బోధనకు దరఖాస్తుల ఆహ్వానం
తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం / వెంకటాపురం : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పిజిసిఆర్టీ ఎకనామిక్స్ పీజీసీఆర్టీ నర్సింగ్ సబ్జెక్టు తాత్కాలిక పద్ధతిలో బోధించుటకు దరఖాస్తు లను కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ ఆహ్వానించారు.స్థానికులు అయి ఉండి అర్హత గల మహిళ అభ్యర్థులు వారి ధ్రువీకరణ పత్రాలతో ఈనెల 20 నుండి 21 వరకు కస్తూర్బా గాంధీ బాలిక విద్యాల యం వెంకటాపురంలో స్పెషల్ ఆఫీసర్ కు వ్యక్తిగతంగా దరఖా స్తులను సమర్పించాలని కోరారు. దరఖాస్తు చేసుకున్న అభ్య ర్థులు పీజీసీఆర్టీ ఎకనామిక్స్ బీఈడీ, పీజీ సిఆర్టి బిఎస్సి నర్సిం గ్ 1 అర్హత కలిగి ఉండాలి. పూర్తి వివరాలకు కేజీబీవీ వెంకటా పురం స్పెషల్ ఆఫీసర్ శిరీష ని 6304594951 నెంబర్లో సంప్ర దించాలన్నారు.