మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి 

Written by telangana jyothi

Published on:

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి 

– ఎస్ ఎఫ్ ఐ అవగాహన సదస్సులో ఎస్సై అభినవ్ పిలుపు

కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని కాటారం పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ మ్యాక అభినవ్ అన్నారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా, కాటారం మండ లం, గారేపల్లి ఎల్జి గార్డెన్స్ లో ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాల ప్రభావం, ఆడపిల్లల రక్షణ, సోషల్ మీడియా తదితర అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని కాటారం పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ మ్యాక అభినవ్ అన్నారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా, కాటారం మండ లం, గారేపల్లి ఎల్జి గార్డెన్స్ లో ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాల ప్రభావం, ఆడపిల్లల రక్షణ, సోషల్ మీడియా తదితర అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు లో ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర సహా కార్య దర్శి దామర కిరణ్, జిల్లా అధ్యక్షులు బొడ్డు స్మరన్ , మండల అధ్యక్షులు అఖిల్, కార్యదర్శి ఈశ్వర్, కమిటీ మెంబర్లు వినయ్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. సమాజంలో పెరిగి పోతున్న పాశ్చాత్య నాగరికత మోజులో యువత, విద్యార్థు లు సెల్ ఫోన్ కు బానిసలు కావద్దని ఎస్ఐ అభినవ్ అన్నారు. ఆడపిల్లల రక్షణ విషయంలో మగ పిల్లలు హుందాగా, గౌరవంగా, కలిసిమెలిసి ఉండాలని, ఈవ్ టీజింగ్ ఇతరత్రా దుశ్చర్యలకు పాల్పడినట్లయితే చట్టరీత్యా చర్యలు చేపడతా మని హెచ్చరించారు. మత్తు పదార్థాలు, డ్రగ్స్, గంజాయి, లాంటి వాటి జోలికి వెళ్ళవద్దని సూచించారు. గంజాయి కేసులో ఇరికినట్లయితే.. జీవితాంతం కోర్టుల చుట్టూ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని వివరించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నిర్వాహకులను అభినందించారు. మాంటోస్సరీ, విద్యానికేతన్, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులు అవగాహన సదస్సుకు హాజరయ్యారు.

Leave a comment