ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం
ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం
– డీఈ నాగేశ్వర్ రావు
ములుగు ప్రతినిధి : 133/32 కేవీ ములుగు విద్యుత్ ఉప కేంద్రంలోని సబ్ స్టేషన్ల పరిధిలో పవర్ కట్ ఉంటుందని, వినియోగ దారులు సహకరించాలని డివిజనల్ ఇంజనీర్ నాగేశ్వరరావు ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28న (ఆదివారం) ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు 132/33 కెవి ఉప కేంద్రంలో మరమ్మతులు కారణంగా వర్షం అంతరాయం లేకుంటే విద్యుత్ సరఫరా నిలిపి వేయ బడుతుందన్నారు. ఉప కేంద్రం పరిధిలో ఉన్న ములుగు, పత్తిపల్లి, కాశీందేవిపేట, మల్లంపల్లి, అబ్బాపూర్, రామచం ద్రాపూర్, పందికుంట, వెంకటాపూర్, లక్ష్మీదేవిపేట, నర్సా పూర్, వెళ్తుర్లపల్లి సబ్ స్టేషన్ల పరిధిలోని గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయ బడుతుందని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.