అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
– సుమారు 20 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, ఒక టీవీ, ఫోన్, ఆరు ద్విచక్ర వాహనాలు స్వాధీనం
– భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే
కాటారం (భూపాలపల్లి), తెలంగాణ జ్యోతి ప్రతినిధి:రాత్రి ఇంటి కన్నపు నేరాలు, బైక్ దొంగతలకు పాల్పడుతున్న దొంగల ముఠాను కాటారం పోలీసులు అరెస్టు చేశారు. దొంగ తనాలకు పాల్పడుతున్న నిందితుల అరెస్ట్ కు సంబందించి వివరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పి కిరణ్ ఖరే ఐ పీ ఎస్ మిడియా కు తెలిపారు.
– అరెస్టు చేసిన నిందితుల వివరములు ఇలా ఉన్నాయి.
ఏ-1) తాటికొండ స్వామి చరణ్ అలియాస్ మున్నా, (19) గాంధీనగర్, మంచిర్యాల
ఏ-2) కురాసేనగా ఈశ్వర్ (19) తిర్యాని, ఆసిఫాబాద్ జిల్లా
ఏ-3) పనేం రాజేశ్ (28) సిరోoచ, గడ్చిరోలి, మహారాష్ర్ట, ప్రస్తుత నివాసం, రాజివ్ నగర్, మంచిర్యాల.
-నిందితుల నుండి స్వాధీన పరుచుకున్న వాటి వివరాలు
బంగారు ఆభరణాలు -17.3 తులాలు (పదమూడు లక్షల ఎనభై నాలుగు వేల రూపాయలు), వెండి ఆభరణాలు -83 తులాలు, బైక్ లు -6, ఎల్ ఈ డీ టీవీ,-1, సెల్ ఫోన్ -1, మొ త్తం విలువ రూ. 20 లక్షల 5వేల 800 లుగా పేర్కొన్నారు. ఎస్పీ కిరణ్ ఖరే తెలిపిన వివరాల ప్రకారం కాటారం మండలం శంకరంపల్లి గ్రామంలో 27- 10- 2024 రోజున రాత్రి సమయంలో దొంగతనం జరగగా బాధితుల ఫిర్యాదు మేరకు కాటారం పోలీసులు కేసు నమోదు చేసి డిఎస్పి రామ్మోహన్ రెడ్డి, సీఐ నాగార్జున రావు ఆధ్వర్యంలో మూడు టీములుగా ఏర్పడి విచారణ కొనసాగించగా, గంగారం ఎక్స్ రోడ్ వద్ద గల సిసి ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తిం చడం జరిగిందన్నారు. నిందితులు మహారాష్ట్రలోని చంద్రా పూర్ దగ్గర రాజురా గ్రామం, ఘనపురం మండలంలోని చెల్పూర్, కొయ్యర్ గ్రామం, హన్మకొండ సుబేదారి, మంథని లోని గుంజమడుగు, పసర, మరియు కాటారం, పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ దొంగతనాలకు పాల్పడి, బంగారు, వెండి ఆభరణాలను మరియు మోటర్ సైకిల్ల ను రాత్రి పూట దొంగి లించేవారు. దొంగిలించిన సొత్తును అమ్మి వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవారన్నారు. కాటారం మండలం శంకరంపల్లి లో దొంగతనం చేసిన సొత్తును, చోరీ చేసిన రెండు బైక్ లపై ముగ్గురు నిందితులు ములుగు జిల్లా పసరలో దొంగిలించిన సొత్తు, బైక్ లు అమ్మడానికి వెళుతుండగా కాటారం సిఐ నాగార్జున రావు, కాటారం ఎస్ ఐ అభినవ్, సిబ్బంది ఆధ్వ ర్యంలో మద్దులపల్లి చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుం డగా పై ముగ్గురు నిందితులు పట్టుబడ్డారు. వీరిని విచారిం చగా వారు ఇంతకు ముందు చేసిన దొంగతములను ఒప్పుకు న్నారు. మహారాష్ట్ర రాస్ట్రంలో రాజుర లో హోండా షైన్ బైక్ , ఘనపురంలోని చెల్పూర్ లో యమహా ఆర్ ఎక్స్-100 బైక్ , కొయ్యర్ గ్రామం లో హీరో గ్లామర్ బైక్, హనుమకొండ అదాలత్ డీ మార్ట్ ఎదురుగా ఒక షాప్ ముందు పార్క్ చేసిన కొత్త స్ప్లెండర్ బైక్, మంథనిలో గుంజపడుగు గ్రామంలో ఇంటి ముందు ఉన్న పల్సర్ బైక్ ను, కాటారం మండలం శంకరం పల్లి లో దొంగిలించిన ఎల్ ఈ డీ టీవీ ని ఒకదాని వెనుక ఒకటినిని దొంగలించి మంచిర్యాలలోని నిందితుడైన స్వామి చరణ్ ఇంటి వద్ద దాచి పెట్టగా, కాటారo పోలీసులు, పైన తెలిపిన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకు న్నారు. ఫై నిందితులపై గతంలో పలు కేసులు నమోదు అయినట్లు తెలిపినారు. ఈ సందర్భంగా ఎస్పీ కిరణ్ ఖరే మాట్లాడుతూ నేరాల నియంత్రంలో సీసీ కెమెరాల పాత్ర కీలక మని, ప్రజలు సీసీ కెమెరాలు ఏర్పాటులో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కేసు చేధనలో సమర్థవంతంగా విధు లు నిర్వర్తించిన డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి, సిఐ నాగార్జున రావు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు,ఎస్సై కాటారం ఎస్ ఐ అభినవ్, అడివి ముత్తారం ఎస్సై మహేందర్, క్లూస్ టీం ఇన్స్పెక్టర్ రాజకుమార్, సిబ్బంది శీను, లక్ష్మిరాజ్, హరి, హరీ ష్, ప్రసాద్, జగన్, లవన్, ఐటీ కోర్ వేణు, హోంగార్డులు తిరు పతి హోంగార్డు రాజయ్య ఐటీ కారు వేణు, హోంగార్డు రాజ య్యను ఎస్పి అభిందించి, నగదును రివార్డు గా అందించారు.