కాటారంలో 10 లక్షల రూ.లతో సీసీ కెమెరాల ఏర్పాటు
కాటారంలో 10 లక్షల రూ.లతో సీసీ కెమెరాల ఏర్పాటు
– స్టేషన్ లో కమాండ్ కంట్రోల్ రూమ్
– పోలీసు త్రిమూర్తులకు ప్రజల నీరాజనాలు
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని పేర్కొంటున్న పోలీసు యంత్రాంగం సూచనకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రం సంపూర్ణ సహకారాన్ని అందిస్తోంది. ఈ మేరకు కాటారం సబ్ డివిజన్ పోలీస్ అధికారి డిఎస్పి గడ్డం రామ్మోహన్ రెడ్డి, కాటారం సర్కిల్ ఇన్స్ పెక్టర్ ఈఊరి నాగార్జున రావు, కాటారం సబ్ ఇన్స్ పెక్టర్ మ్యాక అభినవ్ లు పోలీసు త్రిమూర్తులు తమ శక్తి మేరకు మండలంలోని వివిధ సంఘాలు, సంస్థల నుంచి సీసీ కెమెరాల ఏర్పాటు కోసం పెద్ద ఎత్తున ప్రచారం, అవగాహనతో పాటు భారీగా స్వచ్ఛందంగా నిధుల సమీకరణ చేపట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి కాటారం పోలీస్ స్టేషన్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ఏర్పాటు, కాటారం పోలీస్ స్టేషన్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు తదితర వివరాలను వెల్లడించారు. ఇందులో భాగంగా కిరాణా వర్తక సంఘం రెండు లక్షల ఒక వెయ్యి 116 రూపాయలు, మెడికల్ అసోసియేషన్ రెండు లక్షల పదహారు, ఫెర్టిలైజర్ అసోసియే షన్ లక్ష రూపాయలు, బ్రిక్స్ అసోసియేషన్ 33000, బట్టల వర్తక సంఘం 50,000, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య 25000, మాజీ ఉపసర్పంచ్ నాయిని శ్రీనివాస్ 21000, కామిడీ శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రెడ్డి 30000, ఆర్ఎంపి, పిఎంపీల వెల్ఫేర్ అసోసియేషన్ 50,000, గృహ నిర్మాణ మెటీరియల్ యూనియన్ 50,000, మాజీ ఎంపీటీసీ తోట జనార్ధన్ 21 500, కొట్టే శ్రీహరి 10000, ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 51000, బైక్ షోరూం 25000, ఐచర్ జాన్ ఢీర్ షోరూమ్ 15000, బజాజ్ షోరూం దండ ప్రశాంత్ రెడ్డి 10116, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ 50,000, కొట్టే ప్రభాకర్ 10000, కంగన హాల్ అసోసియేషన్ 33000, ఆదర్శ కాలనీ 21000, పిఎసిఎస్ డైరెక్టర్ చీమల సత్యం 5000 లు విరాళాల రూపేణా జమయ్యాయని తెలిపారు. మొత్తం పది లక్షల 11,648 రూపాయలు సమకూరినట్లు పోలీసులు వెల్లడించారు. అన్ని అసోసియేషన్లతో కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందని, వారి సూచన మేరకు బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి నిర్వహణ చేపట్టడం జరుగుతుందన్నారు. కమిటీ నిర్ణయాల మేరకు టెక్నీషియన్ పనితీరును కొనసాగించడం జరుగుతుందన్నారు. అలాగే కాటారం పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ ల పట్ల అవగాహన చైతన్యవంతం చేయడానికి, ప్రజలను జాగృతం చేయడానికి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని కాటారం పోలీసు త్రిమూర్తులు డీ ఎస్పీ రామ్మోహన్ రెడ్డి, సీఐ నాగార్జున రావు, ఎస్ఐ అభినవ్ పేర్కొన్నారు.