గిరిజన గ్రామాల్లో 12 సీసీ కెమెరాలు ఏర్పాటు
– ఎస్.ఐ కే తిరుపతి రావు.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ములుగు జిల్లా వెంకటాపురం మండ లంలోని గిరిజన గ్రామాల్లో సోమవారం 12 సీ.సీ. కెమెరాలు ఏర్పాటు చేశారు. కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రాంలో భాగంగా నేర నియంత్రణ కోసం గ్రామస్తులు సహకారంతో సీ.సీ. కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వెంకటాపురం ఎస్సై కొప్పుల తిరుపతిరావు తెలిపారు. పీ.ఎస్ పరిధిలోని కొండాపురం, సుర వేడు, సూరవీడుకాలనీ, విజయపురికాలనీ, ఏదిర, ఏకన్న గూడెం ఒంటి చింతలగూడెం తదితర గ్రామాల్లో సీ.సీ. కెమె రాలు ఏర్పాటు చేసినట్లు ఎస్.ఐ.తిరుపతిరావు తెలిపారు.