వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ 

వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ 

వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ 

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రమును బుధవారం డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ క్రాంతి కుమార్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ ను పరిశీలించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వైద్యశాలలో డెలివరీస్ ఎక్కువ కావాలని, సిబ్బంది సమయపాలన పాటించా లని ఆదేశాలు జారీ చేశారు. పెనుగోలు గ్రామంలోని ఆశా కార్యకర్త ఉయిక సమ్మక్క మృతి చెందిన కారణంగా జిల్లా అధికారుల ఆదేశాల మేరకు డాక్టర్ క్రాంతికుమార్ చేతుల మీదుగా 34వేల 400 నగదును పంపిణీ చేశారు. డాక్టర్ మహేందర్, డాక్టర్ మధుకర్ ల ఆధ్వర్యంలో జిల్లాలోని వైద్య సిబ్బంది సహాయ సహకారాలతో రూ.34వేల400 అందజేశా రు. ఈ కార్యక్రమంలో పల్లె దావకాన డాక్టర్ గ్యానస, హెచ్. ఇ. ఓ. వేణుగోపాలకృష్ణ, హె చ్. ఎ స్. కుప్పిలి కోటిరెడ్డి, హె.వి. వెంకటరమణ, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment