అర్హత కలిగిన పేదలకే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి

అర్హత కలిగిన పేదలకే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి

అర్హత కలిగిన పేదలకే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి

– సిపిఎం ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా

వెంకటాపురం నూగూరు, తెలంగాణజ్యోతి : సంక్షేమ పథకాలను, ఇందిరమ్మ ఇళ్ళను అమ్ముకుంటున్నట్టు వస్తున్న వార్తలపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని, అర్హత గల పేదలకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని సిపిఎం పార్టీ వాజేడు మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సంతపాక సెంటర్ నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకు శుక్రవారం ర్యాలీ నిర్వహించి  వినతి పత్రాన్ని ఎంపీడీవో విజయకు  అందించారు. అనంతరం సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కొప్పుల రఘుపతి రావు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం సర్వే నిర్వహించి సర్వే చేసిన లిస్టును పక్కన పెట్టి అధికార పార్టీ నాయకుల కనుసన్నలో అభ్యర్థుల ఎంపిక జరుగుతుందన్నారు ముడుపులు చెల్లిస్తేనే లిస్టులో పేరు పెడుతున్నట్టు వస్తున్న పుకార్లపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి అర్హత కలిగినటువంటి పేదలకు మాత్రమే ఇల్లు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. అధికార పార్టీ చెప్పిన వాళ్లకు మాత్రమే ఇల్లులు మంజూరు చేస్తే సిపిఎం ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతామని, ప్రజలను సమీకరించి పోరాటం ఉదృతం చేయాల్సి వస్తుందని వారన్నారు.  స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్న పేదలు ఇంకా సంక్షేమ పథకాల కోసం దరఖాస్తులు చేసుకునే దుర్మార్గపు స్థితికి ప్రభుత్వాలు తీసుకొచ్చాయన్నారు. పేదలు పేదలుగానే ఉండేలా ప్రభుత్వ విధానాలు అమలవుతున్నాయని, పేదలను ఇంకా పేదరికానికి నెట్టుతున్నారన్నారు.

అసలైన లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం వస్తున్న పుకార్లను నమ్మకండి :  ఎంపీడీవో విజయ

వినతి పత్రం ఇచ్చిన అనంతరం స్పందించిన ఎంపీడీవో మాట్లాడుతూ పూర్తిస్థాయిలో దర్యాప్తు ఇంకా జరుగుతుందని, ఒకటికి రెండుసార్లు అభ్యర్థులు ఎంపిక కోసం కసరత్తు చేస్తున్నామని, అభ్యంతరాలు వస్తే పరిశీలిస్తున్నామని ఖచ్చిత మైనటువంటి లబ్ధిదారులకు మాత్రమే న్యాయం జరిగేటట్లు ప్రయత్నం చేస్తున్నామని, వస్తున్న పుకార్లను నమ్మొద్దని తెలి పారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు జజ్జరి దామోదర్, బచ్చల కృష్ణ బాబు, గుగ్గిళ్ళ దేవయ్య, బచ్చల సౌమ్య, బత్తుల సంతోష్, తోలేం ముత్తయ్య, వేదం రమాదేవి, శాంతకుమారి,తింగ లింగయ్య, పూనెం కృష్ణ బాబు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment