ఇందిరమ్మ కమిటీలు ఏజెన్సీ చట్టాలకు విరుద్ధం

Written by telangana jyothi

Published on:

ఇందిరమ్మ కమిటీలు ఏజెన్సీ చట్టాలకు విరుద్ధం

-పీసా గ్రామసభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరగాలి

– ఏజెన్సీ చట్టాలను దిక్కరిస్తే చూస్తూ ఊరుకునేది లేదు.

– జి. ఎస్. పి ములుగు జిల్లా వర్కింగ్ ప్రసిడెంట్ పూనెం ప్రతాప్ డిమాండ్

వెంకటాపురంనూగూరు, తెలంగాణజ్యోతి: ఏజెన్సీ ప్రాంతా ల్లో పీసా గ్రామసభల ద్వారా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరగాలని గొండ్వాన సంక్షేమ పరిషత్ కార్య నిర్వహక అధ్యక్షులు పూనెం ప్రతాప్ డిమాండ్ చేశారు. ఆదివారం మండల పరిది లోనీ బెస్తగూడెం గ్రామం,కొమరం భీం కాలనీలో జిఎస్పి సంఘ సమావేశానికి ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి కణితి వెంకటకృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కార్యనిర్వహక అధ్యక్షులు పూనెం ప్రతాప్ హాజరై ప్రసంగించారు.కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన ఇందిరమ్మ ఇల్లుల ఎంపిక ప్రక్రియ సరైన పద్ధతి కాదని, ఏజెన్సీ ప్రాంతంలో పూర్తి హక్కులు పిసా గ్రామ సభలకే ఉంటుందని, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కీలక పాత్ర, పిసా గ్రామ సభలకే ఉంటుందని ఆయన అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను కాంగ్రెస్ ప్రభుత్వం కుడా యాదావిధిగా పాటిస్తూ ఏ మాత్రం ఏజెన్సీ ప్రాంత చట్టాలు పట్టించుకోకుం డా ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా పని చేయడం సరైన పద్ధతి కాదనీ ఆయన మండిపడ్డారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్లు ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్లి ఏజెన్సీ ప్రాంతంలో ఈ జీవో లో కలిగిన మార్పులు పెసా చట్టానికి అనుగుణంగా మార్చాలని  పూనెం ప్రతాప్ డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంది రమ్మ ఇండ్లు ఆదివాసి నిరుపేద కుటుంబాలకు ఇవ్వాలని అన్నారు. గత ప్రభుత్వ డబుల్ బెడ్ రూం ఇండ్ల పేరుతో పూర్తిగా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు పంపిణీ చేసిందని, ఏ ఒక్క ఆదివాసికి డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు.అదే తప్పు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెయ్యకుండా పీసా గ్రామసభ ద్వారా ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి నాయకులు పాయం కృష్ణ, కార్యకర్తలు తాటి లక్ష్మయ్య, మనోజ్, రాజేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now