శ్రీ సాయి విజ్ఞాన భారతి హైస్కూల్ లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం
శ్రీ సాయి విజ్ఞాన భారతి హైస్కూల్ లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం
వరంగల్, తెలంగాణ జ్యోతి : వరంగల్ జిల్లా లేబర్ కాలనీ ప్రాంతానికి చెందిన శ్రీ సాయి విజ్ఞాన భారతి హైస్కూల్ నందు మంగళవారం భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు పాఠశాల కరస్పాండెంట్ డా.సామ ల శశిధర్ రెడ్డి తెలిపారు. ఆ సందర్భంగా శశిధర్ రెడ్డి మాట్లా డుతూ భారత రాజ్యాంగా రచించిన భారతరత్న డా.బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. విద్యార్థులచే భారత రాజ్యాంగ పీఠికను ప్రతిజ్ఞ రూపంలో క్రింది విధంగా చదివించడం జరిగిందని ఆయన తెలిపారు. భారత రాజ్యాంగ పీఠిక, భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి ఈ పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం ఆరాధనలతో స్వాతంత్ర్యాన్ని, అంతస్తులోను, అవకాశాల్లోను, సమానత్వాన్ని చేకూర్చుటకు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంర క్షిస్తూ సౌబ్రాతృత్వాన్ని పెంపొందించడానికి 1949 నవంబర్ 26న మన రాజ్యాంగ పరిషత్తులో ఎంపిక చేసుకొని శాస నంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే సమర్ధించు కుంటున్నామని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించి విద్యార్థులకు రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించినట్లు శశిధర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.