అమృత్ సరోవర్ కుంట వద్ద స్వతంత్ర దినోత్సవ వేడుకలు

Written by telangana jyothi

Published on:

అమృత్ సరోవర్ కుంట వద్ద స్వతంత్ర దినోత్సవ వేడుకలు

వెంకటాపూర్ : వెంకటాపూర్ మండలంలోని లక్ష్మీదేవి గ్రామంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనం గా నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ సెక్రటరీ దుర్గా ప్రసాద్ జెండా ఆవిష్కరించారు. అనంతరం రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు చెరువు చెట్టు ప్రతి ఒక వ్యక్తికి అవసరమైంది అని అన్నారు. వాటిని కాపాడుకుంటేనే రైతం గం ,ప్రజలు బాగుంటారని అన్నారు. ముందుగా విద్యార్థులతో కుంట వద్ద ర్యాలీ నిర్వహించి మొక్కలు నాటించారు. ఈ కార్యక్రమంలో కరోబర్ గోస్కుల లక్ష్మణ్, ఫీల్డ్ అసిస్టెంట్లు కేతిరి రాధిక,నల్లవెల్లి భాస్కర్, గ్రామపంచాయతీ సిబ్బంది ముని గాల రామకృష్ణ, బీరెల్లి తిరుపతి ,పాలకుర్తి సురేష్, రైతులు రవిశెట్టి రవి, పోరిక సర్దార్, బిక్షపతి ,ఎర్ర సుధాకర్, రమేష్ గణేష్ తదితర రైతులు ఉన్నారు.

Leave a comment