ఫిబ్రవరి 5న మంత్రిచే మండల పరిషత్ కార్యాలయం ప్రారంభం
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి : మహాదేవపూర్ మండల పరిషత్ నూతన కార్యాలయ భవణంను ఫిబ్రవరి 5 సోమవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఐ.టి. పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభిస్తారని ఎంపీపీ బి. రాణీబాయి రామారావు శనివారం ఒక ప్రకటనలో పేర్కన్నారు. అదివారం నిర్వహిం చాల్సిన ప్రారంభోత్సవ కార్యక్రమం అనివార్య కారణాల వల్ల సోమవారం కు వాయిదా పడిందని, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎంపీపీ బి. రాణీ బాయి రామారావు ఒక ప్రకటనలో పేర్కన్నారు.