ఫిబ్రవరి 27న రెండు హామీల అమలు : సీఎం రేవంత్ రెడ్డి
– మేడారంకు కేంద్రం ఇచ్చింది 3 కోట్లే…
ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా మేడారంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 27న రూ. 500కే గ్యాస్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అమలు చేస్తామని చెప్పారు. పథకం అమలు కార్యక్రమానికి ప్రియాంక గాంధీ వస్తారని తెలిపారు. మేడారం సమ్మక్క సారక్కలను దర్శించుకున్న అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో కేసీఆర్ తల్లులను దర్శించుకోలేదు కాబట్టే ఓడిపోయారన్నారు. జాతరకు కోటిన్నరకు పైగా భక్తులు వచ్చే ఈ పండుగను జాతీయ పండుగగా మార్చమని కేంద్రాన్ని కోరామని కానీ అందుకు కేంద్రం పట్టించు కోలేద న్నారు. దక్షిణాది కుంభమేళా మేడారం జాతరకు కేంద్రం ఇచ్చేది రూ. 3 కోట్ల రూపాయలేనా అని ప్రశ్నించారు. ముఖ్య మైన ఏ కార్యక్రమం తీసుకున్న ఇక్కడి నుంచే మొదలు పెట్టామని రేవంత్ రెడ్డి చెప్పారు. హాత్ సే హాత్ జోడో యాత్ర ఇక్కడి నుంచే ప్రారంభించామని అన్నారు. సమక్క సారక్క దీవెనలతోనే ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు. యాత్ర సమ యంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా జాతర జర్పిస్తామని మాట ఇచ్చామని మాట ప్రకారం జాతర కోసం రూ. 110 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి తో పాటు రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క), టూరిజం , దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, సమాచార పౌర సంబంధాలు, రెవెన్యూ , గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ మురళి నాయక్, పాలకుర్తి శాసనసభ్యులు యశస్విని రెడ్డి, జాతర ప్రత్యేక అధికారులు శరత్, ఆర్వి కర్ణన్,జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఐటీడీఏ పీవో అంకిత్,ఎస్పీ శబరిష్ లతోపాటు తదితరులు ఉన్నారు.