గొర్రెల పంపిణీ పథకం అమలు చేయండి.
గొర్రెల పంపిణీ పథకం అమలు చేయండి.
– ములుగు జిల్లా అధికారులకు వినతి పత్రం.
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది : ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఉప్పేడు వీరాపురం పంచాయతీ గొల్లగూడెం గ్రామంలో గత ఏడాది మే నెలలో సబ్సిడీపై గొర్రెల పెంపకం యూనిట్లు మంజూరు చేసేందుకు 93 మంది యాదవులు, ఒక్కొక్కరు 43 వేల750 రూపాయల చొప్పున డి.డి లు తీశారు. సుమారు 93 మంది యాదవులు గొల్ల కురుమలు డీ.డీలు తీయగా వారిలో 24 మంది పెంపకం దారులకు యూనిట్లు మంజూరయ్యాయి. ఒక్కొక్క యూనిట్ లో 20 గొర్రెలు ఒక పొట్టేలు తో 24 మంది పెంపకం దారులకు పంపిణీ చేశారు. మిగతా 69 మందికి నేటికీ గొర్రెల యూనిట్లు మంజూరు కాకపోవడంతో అప్పో సప్పో చేసి డీడీలు కట్టిన యాదవులు తమకు న్యాయం చేయాలని బుధవారం ములు గు జిల్లా కలెక్టరేట్ కు తరలి వెళ్లారు. తాము చెల్లించిన డీడీ లకు గొర్రెల యూనిట్లు మంజూరు చేయాలని, ఈ సందర్భంగా జిల్లా ప్రస్తుత పశు శాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. పాడి పరిశ్రమ గొర్రెల పెంపకం ద్వారా జీవనం సాగిస్తున్న తమకు ప్రభుత్వం కనికరించి 93 మందిలో మిగతా 69 మంది, పెంపకం దారులకు గొర్రెల యూనిట్లు మంజూరు చేయాలని ఈ సందర్భంగా అధికారులకు విన్నవించారు. ములుగు జిల్లా పశువర్ధక శాఖ అధికారులను కలిసి వినతి పత్రం సమర్పించి . ఈ సందర్భంగా గొర్రెల పెంపకః దారులు మాట్లాడుతు 8నెలల క్రితం గొర్రెల పంపిణీ చేస్తామని, గత ప్రభుత్వం ప్రతి సభ్యుడి నుండి 43 వేల.75o రూపాయలు డి. డి. కట్టించు కున్నారు. ఇప్పటి వరకు గొర్రెల పంపిణీ చేయక పోవడం వలన వడ్డీలు పెరిగి చాలా ఇబ్బందులు పడుచున్నామని, ప్రభుత్వం మారిన తమ గొర్రెలు యూనిట్ మంజూరు చేసి, మమ్మల్ని అధుకో వాలని కోరారు. ఇబ్బం దులు పెట్టడం సరికాదని, వెంటనే డీ. డీ లు చెల్లించిన ప్రతి గొల్ల కురుమ లను ప్రభుత్వం ఆదుకోవాలని గొల్ల కురుమలు గుండె ల ప్రశాంత్ యాదవ్ , రవి యాదవ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నూగూరు వెంకటాపురం గ్రామ గొల్ల గూడెం కురుమలు,యాదవ్లు తదితరులు పాల్గొన్నారు.