విలేకరిపై మట్టి అక్రమ దందారాయుళ్ల దాడి..?

Written by telangana jyothi

Published on:

విలేకరిపై మట్టి అక్రమ దందారాయుళ్ల దాడి..?

– ఫొటోలు తీశాడని దౌర్జన్యం

కన్నాయిగూడెం, తెలంగాణ జ్యోతి : పర్యావరణాన్ని భక్షిస్తూ ప్రకృతి సహజసిద్దమైన వనరులను దోపిడీ చేస్తూ అనుమతి లేకుండా మట్టి తరలిస్తున్న ముఠా సభ్యులు ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో ఓ విలేఖరిపై దాడికి పాల్పడ్డారు. కన్నాయిగూడెం మండలంలో ఓ పత్రికలో విలేకరి అక్రమంగా మట్టి తరలిస్తుండగా వీడియోలు, ఫొటోలు తీశారని కక్షకట్టి దౌర్జన్యానికి పాల్పడ్డారు. బుద వారం ఈ సంఘటన జరిగింది. కన్నాయిగూడెం మండలంలో ఇష్టారీతిన రెవెన్యూ అదికారుల అనుమతి లేకుండా పట్ట పగలు మట్టితరలిస్తున్నారనే విషయం తెలుసుకున్న విలేకరి అక్కడికి వెళ్లి ఫొటోలు తీస్తుండగా స్థానిక లీడర్ సెల్ ఫోన్ లాక్కొని వీడియోలు డిలీట్ చేసి భౌతికదాడికి పాల్పడ్డారు. తాను మట్టితరలింపు ఆపేదిలేదని, దిక్కున్న చోట చెప్పుకో అంటూ దుర్భాషలాడాడు. తీవ్ర భయబ్రాంతులకు గురిచేసి నెట్టివేశాడు. ఇటీవల సీసీ రోడ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమా ణాలు లోపించాయని ఇటీవల ఓ పత్రికలో ప్రచురిచడంతో ఆ విలేకరిని సైతం బెదిరిస్తున్నారని బాధితుడు తెలిపాడు. మట్టి అక్రమరవాణాపై ఆర్ఐని వివరణ కోరగా ఎలాంటి అనుమతి ఇవ్వలేదని, తమకు ఎవరు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకోలేదని వివరణ ఇచ్చారు. ప్రజాహితం కోసం నిజాలను వెలువరిస్తూ వార్తలు రాసేవారిపై దాడులకు పాల్పడ్డ నాయ కులపై అదికారులు చర్యలు తీసుకోవాలని, అక్రమంగా మట్టి తరలింపును నిలువరించాలని, వివిధ ప్రజాసంఘాల నాయ కులు డిమాండ్ చేశారు.కాగా, బాధిత విలేకరిపై దాడికి పాల్పడ్డ నాయకుడిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

Leave a comment