భీమారం ఇసుక సొసైటీలో అక్రమంగా గ్రావెల్ తోలకాలు. 

భీమారం ఇసుక సొసైటీలో అక్రమంగా గ్రావెల్ తోలకాలు. 

భీమారం ఇసుక సొసైటీలో అక్రమంగా గ్రావెల్ తోలకాలు. 

– నిలుపాలని అధికారులకు ఫిర్యాదు చేసిన బిఆర్ఎస్ నేత రామకృష్ణారెడ్డి. 

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలం చింతూరు పంచాయతీ భీమారం గోదావరి ఇసుక సొసైటీలో ఎటువంటి ప్రభుత్వపరమైన అనుమతులు లేకుండా గ్రావెల్ ను అక్రమంగా తరలిస్తు ప్రభుత్వ ఆదాయంకు గండి కొడుతున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని  వాజేడు బారాస మండల పార్టీ అధ్యక్షులు పి. రామకృష్ణారెడ్డి సోమవారం మండల తాహసిల్దార్ కు ఫిర్యాదు చేశారు. ఆయా ఫిర్యాదు నకళ్ళను మీడియాకు విడుదల చేశారు. భీమారం సొసైటీ రేసింగ్ కాంట్రాక్టర్లు, ఇష్టారాజ్యంగా ప్రభుత్వ భూములు నుండి, జెసిబి లు, టిప్పర్ల ద్వారా వందలాది ట్రిప్పులు గ్రావెల్ తోలి అంతర్గత రోడ్లు వేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి రావాల్సిన లక్షలాది రూపాయల ఆదాయానికి గండిపడుతుందని అన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా దొడ్డి దారిన, రాత్రి, పగలు తోలకాలు చేస్తున్నారని, జేసీబీలను ,తోలకం టిప్పర్ లను సీజ్ చేయాలని ఫిర్యాదులొ పేర్కొన్నారు. ఏటూరునాగారం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి, అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్ శాఖ, వాజేడు మండల తాసిల్దార్ కు పిర్యాదు పత్రాలు అందజేసినట్లు మీడియా కు తెలిపారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment