బిఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టులు
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : బిఆర్ఎస్ పార్టీ ఎంఎల్ఎ కౌసిక్ రెడ్డి మీద జరిగిన హత్య యత్నాన్ని నిరసిస్తూ బిఆర్ ఎస్ పార్టీ పిలుపు మేరకు, ఛలో హైదా రాబాద్ కార్యక్రమాన్ని వెంకటాపురం పౌలీసులు అడ్డు కున్నా రు. ఉదయాన్నే బిఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి వెంక టాపురం పోలీస్ స్టేషన్ లో బంధించారు. అరెస్టు లు చేయ టాన్ని మండల పార్టీ అధ్యక్షుడు గంపారాంబాబు తీవ్రంగా ఖండించారు. అరెస్టు అయిన వారిలో వెంకటాపురం మండల అధ్యక్షులు గంప రాంబాబు, అధికార ప్రతినిధి డర్రా దామో దర్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ముడుంబ శ్రీనివాస్, ఎంపీటీసీ సున్నం సాంబశివరావు,యువ నాయకు లు గడ్డం వివేక్, యూత్ అధ్యక్షులు కొండపర్తి శివకృష్ణ, వేల్పూరి రవి, గొరస రాకేష్, నామన సాయి, డర్ర సతీష్, పునెంవెంకటేశ్వర్లు, తుమ్మ రామకృష్ణ, తదితరులు వున్నారు.