పట్టించుకోని అధికారులు – స్పందించని ప్రభుత్వం..!

పట్టించుకోని అధికారులు – స్పందించని ప్రభుత్వం..!

తెలంగాణజ్యోతి, కన్నాయిగూడెం: కన్నాయిగూడెం మండ లం ఐలాపూర్ షెడ్యూల్డ్ తెగ గ్రామ పంచాయితీ రోడ్డు విషయంలో ములుగు జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, ఎస్ సి.డి ఎఫ్ ఓ, ఆర్&బి శాఖల అధికారులు, ఏటూరునాగారం పి ఓ లు రోడ్డు విషయంలో గ్రామస్తులతో చర్చ నిర్వహించి స్పష్టత నివ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు సమావేశం కాగా మాజీ సర్పంచ్ మల్లెల లక్ష్మయ్య మీడియా తో మాట్లాడుతూ మా గ్రామానికి తార్ రోడ్డు నిర్మించాలని 60 సంవత్సరాల నుండి జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి. అధికారులకు, ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాలు ఇచ్చినా మా ఆదివాసి గూడెం  ప్రజల గోడు వినే నాదుడే కరువైనా రన్నారు. ఎన్నికలు రాగానే వివిధ పార్టీల రాజకీయ నాయ కులు మా గ్రామానికి వచ్చి మేము అధికారం లోనికి రాగానే మీ గూడెం మౌలిక సమస్యలను పరిస్కారం చేస్తామని చెప్పి మా గుడెం ప్రజల ఓట్లతో గద్దెలెక్కి రాజభోగమేలుతు మా గ్రామానికి రోడ్డు విషయాన్ని మరిచిపోవటం మమ్ములను కలచి వేస్తుందన్నారు. రాజ్యాలు మారిన రాజులు మారిన మా గ్రామానికి రోడ్డు రాదని తెలుసుకున్నా ఐలాపూర్ గ్రామ పెద్దలు సమావేశమై మనమే మారాలని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జన కుల గణ సర్వేను బహిస్కరించి 10 రోజులు గడుస్తున్నా స్పందించని అధికారులకు రాజకీయ ప్రభుత్వ అధికారులకు సరైన బుద్ధి చెప్తామన్నారు.  అధికారు లు స్పందించే వరకు విడుతల వారీగా భగవాన్ బిర్సా ముండా, కొమరం భీమ్ స్ఫూర్తితో ఆదిశక్తులు సమ్మక్క సారక్కల ఆశీసులతో మా గూడెంకి రోడ్డు నిర్మించే వరకు ఉద్యమాన్ని బలోపేతం చేసి తిరుతామని డిమాండ్ చేశారు. ఈ సమావేశం లో ఆదివాసి కోయకుల పెద్దమనుషులు పటేల్ మల్లెల నాగయ్యా, సుధాకర్, రామచంద్రయ్య బాలయ్య, మల్లేష్, దొర వెంకటయ్య, లక్షుమయ్య, సమ్మయ్య, నర్సయ్య, యూత్ -సమ్మయ్య సదానందం, యాదగిరి, నగేష్ రాంబాబు, కాంతారావు, లింగయ్య, లచ్చం పెసా కమిటీ అటవీ హక్కుల కమిటీ సభ్యులు, గ్రామస్తులు, పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment