ప్రశ్నిస్తే కేసులు పెడతారా ..?

ప్రశ్నిస్తే కేసులు పెడతారా ..?

ప్రశ్నిస్తే కేసులు పెడతారా ..?

– మంత్రి శ్రీధర్ బాబుకు బిజెపి నేత చల్ల సూటి ప్రశ్న 

కాటారం, తెలంగాణజ్యోతి ప్రతినిధి:ప్రశ్నిస్తే కేసులు పెడ తారా?అంటూ బిజెపి రాష్ట్ర నాయకులు చల్ల నారాయణరెడ్డి అన్నారు. గురువారం ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిజెపి నేతలతో కలిసి నారాయణ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డి మాట్లా డుతూ మంథని శాసనసభ్యులు మంత్రి శ్రీధర్ బాబు తన మీద కుట్ర, కక్ష సాధింపు చేస్తూ రాజకీయ విమర్శలు స్వీక రించలేక అధికారాన్ని అడ్డుపెట్టుకొని కేసులు నమోదు చేయి స్తున్నారని చల్ల ఆరోపించారు. బిజెపి పార్టీ పక్షాన ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని అన్నారు. బిజెపి పార్టీకి ప్రజల్లో వస్తు న్న ఆదరాభిమానాలు సహించలేక పోలీసుల సహకారంతో తనమీద అక్రమంగా కేసులు పెడుతున్నారని చల్ల అన్నారు. ఆగస్టు 30వ తేదీన జరిగిన కాటారం మండల ఆటో యూని యన్ సభ్యులకు బిజెపి పార్టీ తరఫున మద్ధతుగా ధర్నా కార్యక్రమంలో పాల్గొంటే బిజెపి పార్టీకి ఎక్కడ మైలేజీ వస్తుం దో అని ఓర్వలేక సిఐ చేత మంత్రి కేసు బుక్ చేయించారని అన్నారు. సొంత మండలం అయిన కాటారం మండల కేంద్రం తోపాటు మహాదేవపూర్లో వంద పడకల ఆసుపత్రి, మార్చురి గది కట్టించమని అడిగితే పట్టించుకోవడంలేదని విమర్శిం చారు. కాటారంలో ప్రభుత్వ హాస్పిటల్ ఉన్న సరైన వైద్య సిబ్బంది లేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. హైదరాబాద్ మూసి నది ప్రక్షాళన అంటున్నారు కానీ మంత్రి నియోజకవర్గం ను ప్రక్షాళన చేయండి అని శ్రీధర్ బాబుకు సూచన చేశారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టించే సంస్కృతి మానేసి, అభివృద్ధి చేయాలని చల్లా నారాయణరెడ్డి అన్నారు. కేసులకు భయపడేది లేదని, 100 కేసులు పెట్టిన వెను తిరిగేది లేదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో కాటారం మండల బిజెపి అధ్యక్షులు బండం మల్లారెడ్డి, మాజీ అధ్యక్షులు బొమ్మన భాస్కర్ రెడ్డి, మండల ఇన్చార్జి పిల్లామారి సంపత్, డోలి అర్జయ్య, రాజు యాదవ్, కేతిరి రాజు, తదితర బిజెపి నాయకులు పాల్గొన్నారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment