మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిస్తే ఉపాధి చూపిస్తాం

మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిస్తే ఉపాధి చూపిస్తాం

– జిల్లా ఎస్పీ శబరీష్

– లొంగిపోయిన మావోయిస్టులకు రివార్డులు అందజేత

ములుగు, తెలంగాణ జ్యోతి  : అజ్క్షాతంలో ఉన్న మావోయి స్టులు జనజీవన స్రవంతిలో కలిసి కుటుంబాలతో జీవనం సాగించాలనుకుంటే తప్పకుండా సహకరిస్తామని, ఉపాధి అవకాశాలు, సంరక్షణ, సంక్షేమం చూపిస్తామని జిల్లా ఎస్పీ డాక్టర్ పి.శబరీష్ సూచించారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో లొంగిపోయిన పలువురు మావోయిస్టులకు నగదు రివార్డులను ఎస్పీ అందజేశారు. ములుగు జిల్లా వాజేడు మండలం ప్రగళ్లపల్లికి చెందిన పుల్లూరు నాగరాజు అలియాస్ జగత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం బర్గుపాడుకు చెందిన నూప బీమా అలియాస్ సంజు, సంజు భార్య ముచకి దుల్డో అలియాస్ సోనీలు లొంగిపోగా వారిపై ఉన్న నగదు రివార్డును అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కాలం చెల్లిన సిద్ధాంతాలతో అడవుల్లో తిరుగుత అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు. మావోయిస్టు పార్టీలో చేరిన కొందరు కొద్ది రోజులకే సిద్ధాంతాలు నచ్చక తిరిగి సమాజాంలో కలిసి కుటుంబాలతో ప్రశాంతంగా జీవిస్తున్నారన్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం కల్పిస్తున్న భరోసాతో మావోయిస్టులు లొంగిపోతున్నారని పేర్కొన్నారు. లొంగిపోయిన సీపీఐ మావోయిస్టులకు పునరావాసం, సంక్షేమం కోసం ప్రభుత్వం రివార్డులు అందిస్తోందని పేర్కొన్నారు. వారి మిగిలిన జీవనం ప్రజాసేవ కోసం సమాజంతో ఏకమై గడపాలన్నారు. ఈ కార్యక్రమంలో 39బెటాలియన్ కమాండంట్ రాజేష్ తివారీ, ములుగు డీఎస్పీ రవీందర్ పాల్గొన్నారు.