జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ లో ప్రతిభ చాటిన ఆదర్శ విద్యార్థులు

జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ లో ప్రతిభ చాటిన ఆదర్శ విద్యార్థులు

జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ లో ప్రతిభ చాటిన ఆదర్శ విద్యార్థులు

కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ లో మండలకేంద్రంలోని ఆదర్శ హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ చాటారు. సైన్స్ ఫెయిర్ లో మూడు విభాగాల్లో ద్వితీయ స్థానంలో నిలిచారు. సైన్స్ విభాగంలో మహిళల భద్రత కోసం ప్రత్యేక పరికరాలు రూపొందించిన అంజు శ్రీ, అభినవి, మల్టీపర్పస్ అగ్రికల్చర్ మిషన్ ను తయారుచేసిన అద్నాన్, గోవర్ధన్ లు ద్వితీయ స్థానంలో నిలిచారు. మాథ్స్ విభాగంలో తేల్స్ సిద్ధాంతంతో సిరి చందన, సాయి చరణ్య లు ద్వితీయ స్థానంలో నిలిచి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఆదర్శ విద్యార్థులు సృజనాత్మకతతో రూపొందించిన ప్రాజెక్టులు అందరి ప్రశంసలు అందుకున్నాయి. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు డీఈఓ రాజేందర్, డీఎస్ఓ స్వామిలు సర్టిఫి కెట్స్, షీల్డ్ లను అందజేశారు. మూడు విభాగాల్లో విద్యా ర్థులు ద్వితీయ స్థానంలో నిలవడం పట్ల ఆదర్శ విద్యాసంస్థల చైర్మన్ జనగామ కరుణాకర్ రావు, కరస్పాండెంట్ కార్తీక్ రావు, ప్రిన్సిపల్ కృషితలు హర్షం వ్యక్తం చేసి సన్మానించారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment