Cm Revanth Reddy | రేవంత్ అనే నేను…

Written by telangana jyothi

Published on:

Cm Revanth Reddy | రేవంత్ అనే నేను…

– తెలంగాణ రాష్ట్ర రెండో సీఎంగా రేవంత్ రెడ్డి.

– అధిష్టానం నుంచి రేవంత్ కు పిలుపు

– హుటాహుటిన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరిన రేవంత్ రెడ్డి

– రెండు రోజుల సస్పెన్స్ కు తెరదించిన కాంగ్రెస్ అధిష్టానం

– సమావేశంలో ప్రకటించిన కేసీ వేణుగోపాల్

డెస్క్, తెలంగాణ జ్యోతి : తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి పేరుని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. తెలంగాణ కాంగ్రెస్ సీఎల్పీ భేటీలో అందిన తీర్మానాన్ని వరిశీలించిన అనంతరం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కొనసాగిం చాలని అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయించారని ప్రకటించారు. తెలంగాణ సీఎల్పీ సమావేశంలో చేసిన మూడు తీర్మానాలను పరిశీలకులు పార్టీ అధ్యక్షుడికి అందించారని వెల్లడించారు. తెలంగాణలో అఖండ విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యావాదాలు తెలిపే తీర్మానం మొదటిది కాగా అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీలకు ధన్యవాదాలు తెలుపేది రెండో తీర్మానమ న్నారు. ఇక మూడోది అతి ముఖ్యమైనది సీఎల్పీ నేత ఎంపికను అధిష్ఠానానికే వదిలేస్తూ ఎమ్మెల్యేలు తీర్మానాన్ని ఆమోదించారని కేసీ వేణుగోపాల్ వివరించారు. రిపోర్ట్ పరిశీలించిన తర్వాత సీనియర్లతో చర్చించామని, రేవంత్ని ముఖ్యమంత్రి చేయాలని పార్టీ నిర్ణయించిందని వివరించారు. కాగా తెలంగాణ రాష్ట్ర రెండో సీఎంగా రేవంత్రెడ్డి ఈ నెల 7న బాధ్యతలు చేపట్టనున్నారు.

హుటాహుటిన ఢిల్లీకి రేవంత్….

కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అని ప్రకటించారు. దాంతో రెండు రోజుల తరువాత తెలంగాణ సీంపై సస్పెన్స్ వీడింది. డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. నేటి సాయంత్రం కాంగ్రెస్ పెద్దలు కొందరు హైదరాబాద్ కు వచ్చి సీఎల్పీ నేతని ప్రకటించి సీఎంపై స్పష్టత ఇస్తారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో ఎల్లా హెూటల్ నుంచి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. నేటి రాత్రి ఢిల్లీలో ఏఐసీసీ -ఆగ్రనేత లతో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారని సమాచారం. సీఎం రేసులో తామూ ఉన్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్య సైతం పట్టు వీడలేదు. ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం సీఎంగా రేవంత్ రెడ్డి పేరు ఖరారు చేసింది. దాంతో రెండు రోజుల తరువాత తెలంగాణ కొత్త సీఎంపై సస్పెన్స్ వీడింది. తెలంగాణాలో కాంగ్రెస్ ను కచ్చితంగా గెలిపిస్తానని హైకమాండ్ కు మాటిచ్చారు. అలాగే పార్టీని గెలిపించి తన సత్తా ఏంటో నిరూ పించారు. రేవంత్ రెడ్డి, పార్టీలో దశాబ్దాలుగా పాతుకు పోయిన నేతలు న్నప్పటికీ, తన వాక్ చాతుర్యం, ప్రశ్నించేతత్వంతో పాటు సీనియర్లను కలుపుకునిపోయి అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీకి మరోసారి ఊపిరిపోశారు. భట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి బ్రదర్స్ లాంటి నేతలను వెనక్కినెట్టి మరీ అధిష్టానంతో మా సీఎం రేవంత్ రెడ్డి అని ప్రకటించేలా చేసుకున్నారు.

రేవంత్ రెడ్డి  ప్రస్థానం…

అనుముల రేవంత్ రెడ్డి.. 1969 ఆగస్టు 8న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని కొండారెడ్డి పల్లెలో.. దివంగత నరసింహారెడ్డి, రామచంద్రమ్మ దంపతులకు జన్మించారు. రేవంత్ రెడ్డికి మొత్తం ఆరుగురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివిన రేవంత్ రెడ్డి ఇంటర్ ఓ ప్రైవేట్ కాలేజ్ పూర్తి చేశారు. అనంతరం డిగ్రీ చేసేందుకు హైదరాబాద్ వచ్చారు. ఉస్మానియా అనుబంధ కాలేజీ ఏవీ కాలేజీలో డిగ్రీ(ఫైన్ ఆర్ట్స్) పూర్తి చేశారు. చిన్ననాటి నుంచి నాయకత్వ లక్షణాలున్న రేవంత్ పాఠశాలలో చదివే రోజుల్లోనే స్టూడెంట్ లీడర్ ఉన్నారు. రూకుడుగా, చురుకుగా ఉండే రేవంత్ రెడ్డి విద్యార్థుల సమస్యలపై పోరాడేవారు. ఏబీవీపీ స్టూడెంట్ యూనియన్లో మెంబర్ చేశారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత పెయింటర్ కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత సోదరుడితో కలిసి ప్రిటింగ్ ప్రెస్ స్టార్ట్ చేశారు. అది విజయవంతం అవ్వడంతో.. రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆర్థికంగా నిలదొక్కుకున్న రేవంత్ రెడ్డి.. ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. 1992లో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి సోదరుడి కుమార్తె గీతారెడ్డిని ప్రేమవివాహం చేసుకున్నారు. రేవంత్ రెడ్డి. వీరికి ఒక కుమార్తె ఉన్నారు.

రేవంత్ రాజకీయ ప్రస్థానం…

ఆర్ఎస్ఎస్ ను వీడిన రేవంత్ రెడ్డి తెలుగు దేశం పార్టీలో చేరారు. టీడీపీ నుంచి బయటకు వచ్చి కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గుచూపారు రేవంత్ రెడ్డి. 2001-02 మధ్య టీఆర్ఎస్ కార్యకర్తగా పనిచేశారు. ఆ తర్వాత 2004లో కల్వకుర్తి టికెట్ ఆశించినా.. కూటమి పొత్తుల్లో భాగంగా ఆ సీటు రేవంత్ కు దక్కలేదు. 2006లో జడ్పీటీసీ ఎన్నికల్లో కేసీఆర్ టికెట్ ఇస్తారని భావించినా మళ్లీ నిరాశే ఎదురైంది. దీంతో టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన రేవంత్ రెడ్డి.. 2008లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. రాజకీయ దిగ్గజాలు కేసీఆర్, వైఎస్ఆర్ వ్యూహాలను చిత్తుచేసి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. అప్పుడే రేవంత్ రెడ్డి పేరు రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగింది. ఎమ్మెల్సీగా గెలిచిన రేవంత్ రెడ్డి.. తనకు ఎంతో ఇష్టమైన టీడీపీలో చేరారు. టీడీపీలో యాక్టివ్గా పనిచేసిన రేవంత్ రెడ్డికి శ్రా చంద్రబాబు 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ టికెట్ కేటాయించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అనూహ్యంగా ఓటమి పాలైనా.. రేవంత్ రెడ్డి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో గెలుపొందిన రేవంత్.. 2018లో బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.

ఓటుకు నోటు కేసులో…

2015లో తెలంగాణ శాసన మండలి ఎన్నికల సందర్భంగా టీడీపీ అభ్యర్ధికి అనుకూలంగా ఓటు వేయాలంటూ.. నామినేట్ ఎమ్మెల్యే స్టీఫెన్సనక్కు రేవంత్ రెడ్డి లంచం ఇవ్వజూపారంటూ ఒక స్టింగ్ ఆపరేషన్ వీడియోతో సహా ఆరోపణలు రావటంతో ఏసీబీ అయస్ను అరెస్టు చేసింది. 45 రోజులకు పైగా జైలు జీవితం గడిపి బెయిల్పై విడుదలయ్యారు. 2017లో టీడీపీకి గుడై జై చెప్పి.. మరికొందరు టీడీపీ నాయకులతో సహా ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

2017లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న రేవంత్…

అయితే తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితులు, టీడీపీలోనే ఉంటే రాష్ట్రస్థాయి నాయకుడిగా ఎదిగే ఛాన్స్ లేదని భావించిన రేవంత్ రెడ్డి 2017 అక్టోబర్లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ కొడంగల్ నుంచి బరిలోకి దిగిన రేవంత్ రెడ్డి.. టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై ఓటమి పాలయ్యా రు. అయితే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డి.. టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డిపై 10,919 ఓట్ల తేడాతో గెలుపొంది మొదటి సారి పార్లమెంట్ లో అడుగుపెట్టారు.

Tj news

1 thought on “Cm Revanth Reddy | రేవంత్ అనే నేను…”

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now