ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ ర్యాలి.
వెంకటాపురం నూగూరు, ఫిబ్రవరి 16 తెలంగాణాజ్యోతి ప్రతినిది :
ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల కేంద్రంలో శుక్రవారం సార్వత్రిక దేశవ్యాప్త సమ్మెలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు. వెంకటాపురంలో నిర్వహించిన సార్వత్రిక సమ్మెలో భారీ ఎత్తున అంగన్ వాడిలు, ఆశా వర్కర్లు జీపీ కార్మికులు 2 వ ఎ.ఎన్.ఎం.లు, రైతులు ర్యాలీలో హాజర య్యారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ, కనీస పనికి కనీస సమాన వేతనం 26 వేలు ఇవ్వా లని దిమాండ్ చేస్తూ నినాదాలు చేసారు. దిక్కులు పిక్కటిల్లేలా ఆందోళన కారులు స్లోగన్లు ఇచ్చారు. ఈసందర్బంగా సీపీఐ ములుగు జిల్లా కార్యదర్శి తోట మల్లికార్జునరావు మాట్లాడుతూ, కార్మికుల సమం జసమైన కోర్కెలను ఆమోదించాలని , అంగన్ వాడి లను ప్రభుత్వ ఉద్యోలుగా గుర్తించాలని మిగతా ఆశ, జీపీ, 2 వ ఎఎన్ఎం లకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. కేంద్రలో అదికారంలో వున్న బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల అధ్యక్షులు కట్ల రాజు, సంఖ్య అది నారాయణ , వరలక్ష్మీ, గంగా భవాని , రాజేశ్వరి , కల్యాణి , ధనలక్ష్మి , సీఐటీయూ నుండి కట్ల చారి, సీపీఎం మండల కార్యదర్శి కుమ్మరి శ్రీను, వి . ప్రేమమ్మ , వెంకటరమణ, .సడాలమ్మ ఇంకా పలువురు కార్మిక సంఘాల నాయకులు, సంఘాల కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు.