ఈ రోడ్డుపై రాకపోకలు సాగించేది ఎలా?
– బీసీ మరి గూడెం ప్రజలు, విద్యార్థులు ఆవేదన.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా మండల కేంద్రం నూగూరు వెంకటాపురం శివారు బీ.సీ మర్రి గూడెం మండల పరిషత్ పాఠశాలకు వెళ్లే రోడ్డు అద్వాన్న స్థితికి చేరుకుంది. కమ్మరిగూడెం వెళ్లే రోడ్లో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కు వెళ్లే విద్యార్థులు, ఆ వీధి ప్రజలు సిమెంట్ పైపులు పగిలిపోయి ఇరువైపులా ప్రమాదకరమైన గోతులు ఏర్పడ్డాయి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న గోతుల్లో పడి గాయాల పాలై అవకాశం ఉందని, ప్రజలు, విద్యార్థులు,వారి తల్లిదండ్రులు ఆవే దన వ్యక్తం చేస్తున్నారు. సుమారు సంవత్సరం క్రితం సిమెంట్ పైపులు పగిలిపోయి ప్రమాదకరంగా, గోతులు ఇరువైపులా ఏర్ప డ్డాయి. రోడ్డు కు మధ్యలో,గోతులు పడటంతో ప్రమాదకరంగా మారింది. గోతుల రోడ్లో సర్కస్పీట్లతో ప్రజలు, విద్యార్థులు రాక పోకలు సాగిస్తున్నారు. ప్రమాదకరమైన గోతుల కల్వర్టును మర మ్మతులు చేయమని, బీసీ మరి గూడెం పంచాయతీ కార్యదర్శి కి, అధికారులకు విన్నవించిన పట్టించుకోవటం లేదని ప్రజలు, మహిళలు శాపనార్ధాలు పెడుతూ దుమ్మూ, థూళీ ఎత్తి పోస్తు న్నారు. జిల్లా పంచాయతీ అధికారి మండల పరిషత్, గ్రామ పంచాయతీ అధికారులు, వెంటనే స్పందించి కమ్మరిగూడెం రోడ్ లో వున్న పాఠశాలకు వెళ్లే రోడ్డును వెంటనే మరమ్మతులు చేయించి, ప్రమాదాలు జరగకుండా చూడాలని ప్రజలు పత్రికా ముఖంగా ప్రజలు ముక్తకంఠంతో విజ్ఞప్తి చేస్తున్నారు .