కొంపముంచిన యూట్యూబర్ వీడియో..!
– మేడారంలో అటవీ జంతువుల అవయవాలు విక్రయం
– యూట్యూబ్ తో విషయం బయటకు
– మహిళను అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్ అధికారులు
ములుగు, తెలంగాణ జ్యోతి : ఓ యూట్యూబర్ చేసిన వీడియో వైరల్ కావడంతో అటవీ జంతువుల అవయవాలను అమ్ముతున్నారనే విషయాన్ని గుర్తించి ఫారెస్ట్ అధికారులు వస్తువులను స్వాధీనం చేసుకొని మహిళను అరెస్ట్ చేశారు. ఈ సంఘటన మంగళవారం జరిగింది. అటవీ రేంజ్ అధికారి శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెంచుకాలనీకి చెందిన చెంచు లక్ష్మీ తనకు వచ్చిన ప్రకృతి వైద్యం చేస్తూ జీవనం సాగిస్తోంది. మేడారం మహాజాతర నేపథ్యంలో వారంరోజులపాటు జాతరలో ఉండి ప్రకృతి వనమూళికలతో ఏ వ్యాధినైనా నయం చేస్తానంటూ భక్తులకు జోష్యం చెప్పింది.
జాతరకు వచ్చిన ఓ యూట్యూబర్ చెంచు లక్ష్మీకి సంబంధించిన వీడియోచేసి ఆమె వద్ద ఏరోగానికి ఏ మందులు ఉన్నాయో అడిగి తెలుసుకున్నాడు. ఈ వివరాలన్నీ వీడియో తీసుకున్న సదరు యూట్యూబర్ సోషల్ మీడియాలో పోస్టుచేసి వైరల్ చేశాడు. ఈ విషయం కాస్తా ఫా యూట్యూబ్స్ట్ ఆఫీసర్ల దృష్టిలో పడటంతో ఆరా తీసి చెంచుకాలనీకి వెళ్లి చెంచులక్ష్మీ ఇంటిని సోదా చేశారు. అక్కడ వారికి అటవీ జంతువుల అవయవాలు, మూళికలు లభించాయి. చట్టవిరుద్ధంగా కలిగి ఉన్న వాటిని సీజ్ చేసిన అధికారులు ములుగు రేంజ్ కార్యాలయానికి తరలించి చెంచు లక్ష్మీని అరెస్ట్ చేశారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం చెంచు లక్ష్మీపై కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజర్లు శంకర్, శీతల్, బీట్ అధికారులు చిస్తీ, రవీనా, సీతారాం, వసంత, బేస్ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు.