హోరా హోరీగా ట్రస్మా క్రీడా పోటీలు

హోరా హోరీగా ట్రస్మా క్రీడా పోటీలు

హోరా హోరీగా ట్రస్మా క్రీడా పోటీలు

కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ట్రస్మా ఏరియా కమిటీ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని ఆదర్శ హైస్కూల్ లో సబ్ డివిజనల్ స్థాయి క్రీడా పోటీలు ఆదివారం రెండో రోజు హోరా హోరీగా సాగాయి. సబ్ డివిజన్ పరిధిలోని 18 ప్రయివేట్ పాఠశాలల విద్యార్థులు పాల్గొనగా కబడ్డీ, ఖో ఖో పోటీలు రసవత్తరంగా జరిగాయి. జట్లు ఫైనల్ కు చేరుకోగా తుది పోరు సోమవారం జరుగు తుం దన్నారు. విజేతలకు రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా సోమవారం బహుమతులు అందజే యడం జరుగుతుందని కాటారం ఏరియా కమిటీ అధ్యక్షుడు కొట్టే శ్రీశైలం తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా జనరల్ సెక్రటరీ సంపత్ రావు, ఉపాధ్యక్షుడు కార్తీక్ రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, ఏరియా కమిటీ కార్యదర్శి రాజబా బు, కోశాధికారి వెంకటేష్ గౌడ్, టస్మా జిల్లా కార్యవర్గ సభ్యులు మంజుల, శశి, ఆయా పాఠశాలల కరస్పాండెంట్లు, ఉపాధ్యా యులు, విద్యార్థులు పాల్గొన్నారు.