హోరా హోరీగా షటిల్ టోర్నీ – క్రీడల హబ్ గా కాటారం

హోరా హోరీగా షటిల్ టోర్నీ - క్రీడల హబ్ గా కాటారం

హోరా హోరీగా షటిల్ టోర్నీ – క్రీడల హబ్ గా కాటారం

విజేతలకు సీఐ బహుమతుల పంపిణీ

కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : జయశంకర్ భూపాల పల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని సువిద్య హైస్కూల్లో జరిగిన మండల స్థాయి షటిల్ టోర్నీ హోరా హోరీగా ముగిసింది. సోమవారం సాయంత్రం సువిద్య స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి కాటారం సిఐ నాగార్జున రావు, ఎస్సై అభినవ్, జిల్లా అథ్లెటిక్స్ కార్యదర్శి పూతల సమ్మయ్య, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, సువిద్య స్కూల్ చైర్మన్ కొట్టే శ్రీశైలం, నిర్వాహకులు ఆత్మకూరి కుమార్ పాల్గొన్నారు. సుమారు 60 మంది క్రీడాకారులు పాల్గొ న్నారు. ఈ సందర్భంగా సిఐ నాగార్జున రావు మాట్లాడుతూ క్రీడలు దేహదారుడ్యానికి, దృఢత్వానికి ప్రతీకగా నిలుస్తాయని అన్నారు. ఉద్యోగ అవకాశాలలో క్రీడల రిజర్వేషన్ పొందవచ్చు అని సూచించారు. క్రీడల హబ్ కేంద్రంగా కాటారం తయారవు తున్న నేపథ్యంలో పోలీసు శాఖ ద్వారా సహాయ సహకారాలు అందజేస్తామని అన్నారు. మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు, సువిద్యా స్కూల్ తరహాలో ఇతర విద్యాసంస్థలు టోర్నమెంట్లు నిర్వహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. క్రీడలను నిర్వహించినందుకు సువిద్య స్కూల్ చైర్మన్ కొట్టే శ్రీశైలం ను అతిథులు అభినందించి, ఘనంగా సన్మానించారు. మారూమూల ప్రాంతంలోని క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని వెలికితీయడానికి ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. సువిద్య స్కూల్ చైర్మన్ కొట్టే శ్రీశైలం మాట్లాడుతూ క్రీడాకారుల్లో నైపుణ్యతను వెలికితీయడానికి టోర్నమెంట్ నిర్వ హించామని అన్నారు. టోర్నీ ప్రారంభంలో శ్రీపాద చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దుద్దిల్ల శ్రీను బాబు రాగా కాటారంలో ఇండోర్ స్టేడియం స్థల సేకరణ విషయమని విన్నవించామని, మంత్రి శ్రీధర్ బాబు ద్వారా జిల్లా కలెక్టర్ కు నివేదించినట్లు వివరిం చారు. మొదటి బహుమతి ఊదరి ఉదయ్, మంత్రి ప్రవీణ్ జట్టు కాగా ద్వితీయ బహుమతి కడారి శేఖర్, లింగమూర్తి జట్టు, తృతీయ బహుమతి జోడు శ్రీనివాస్, దుంపల నవీన్ లకు బహుమతులు అందజేశారు. ఇదిలా ఉండగా బెస్ట్ ప్లేయర్ అవార్డు మెరుగు వరుణ్ కు నగదు బహుమతిని కామెడీ శ్రీనివాసరెడ్డి ప్రకటించి అందజేశారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment