హోలీ ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి.

హోలీ ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి.

– మద్యం సేవించి వాహనాలు నడపరాదు.

మహాదేవపూర్, తెలంగాణ జ్యోతి : మహాదేవపూర్ మండల ప్రజలు హోలీ పండుగను ప్రశాంతమైన వాతావ రణంలో జరుపుకోవాలని మహాదేవపూర్ సిఐ రాజేశ్వరరావు, మహాదేవపూర్ ఎస్సై ప్రసాద్, కాళేశ్వరం ఎస్ ఐ భవాని సేన్ లు ఒకప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ మహాదేవపూర్ మండలంలోని సి ఐ పరిధిలోని ప్రజలకు సిఐ, ఎస్ఐ లు ముఖ్యమైన సూచనలు జారీ చేశారు. హోలీ పండుగ సందర్భంగా రోడ్లపై బైకులు అడ్డంగా పెట్టి, ప్రయాణికుల బస్సులకు ఇతర వాహనాల వారికి అంతరాయం కలిగించకూడదు అని ప్రైవేటు పార్టీలకు, డిజె లకు పర్మిషన్ లేదన్నారు. ముఖ్యంగా మహిళలపై అమ్మాయిలపై అనవసరంగా రంగులు చల్లి ఇబ్బందులకు గురి చేసినట్లయితే అట్టి వారిపైన కఠిన చర్యలు తీసుకోబడునని, హోలీ పండుగ సందర్భంగా ప్రధాన కూడళ్ల వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయబడును ఇందుకు వాహనదారులందరూ పోలీస్ వారికి సహకరించా లన్నారు. హాస్పిటల్, దేవాలయాలు, చర్చి, మసీదులు, మొదలైన ప్రాంతాలలో రంగులు చల్లి ఇతరులకు ఇబ్బందులకు గురి చేయవద్దన్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం నేరమన్నారు.హోలీ అనంతరం గోదావరినది,చెరువులలో లోతట్టు ప్రాంతంలో స్నానాలు ఆచరించే క్రమంలో జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అని సూచించారు. ముఖ్యంగా యువత తల్లిదండ్రులు పిల్లలను గమనిస్తూ వారికీ సరైన పద్ధతిని తెలియజేయాలనీ సూచించారు.ఈసందర్భంగా మండల ప్రజలకు ప్రజా ప్రతినిధులకు, అధికార్లకు మహాదేవపూర్ సిఐ రాజేశ్వరరావు, మహాదేవపూర్ ఎస్ఐ ప్రసాద్, కాళేశ్వరం ఎస్ ఐ భవాని సేన్ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.