శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్న హైకోర్టు జడ్జి
కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం లో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జి కుటుంబ సభ్యులతో కలసి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వారిని అర్చకులు రాజగోపురం వద్ద పూర్ణ కుంభ స్వాగతం పలికి ఆహ్వానించా రు.అనంతరం స్వామివారికి అభిషేకం, శుభానంద అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అమ్మవారి ఆలయంలో జడ్జి దంపతు లకు బుర్రి శ్రీనివాస్ సూపర్డెంటెంట్ శేష వస్త్రాలతో సన్మానించ గా అర్చక స్వాములు వేద పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసా దాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో (ఓ ఎస్ డి)బోనాల కిషన్, డి.ఎస్.పి, సీఐ, ఎస్సైలు మహాదేవపూర్ డిప్యూటీ తాసిల్దార్ కృష్ణ మరియు వివిధ జిల్లా కోర్టు జడ్జిలు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.