హాయ్.. అక్క మీ రాజ్యానికి వచ్చా..!
– మేడారంలో పొంగులేటి శ్రీనున్నకు స్వాగతం పలికిన సీతక్క..!
ములుగు/ మేడారం, తెలంగాణ జ్యోతి : అక్క మీ రాజ్యానికి వచ్చా మొక్కు చెల్లించుకునేందుకు మేడారం వచ్చా అంటూ రాష్ట్ర రెవెన్యూ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ములుగు జిల్లాలో రెండేళ్ల కో మారు ఘనంగా నిర్వహించే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సోమవారం ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విచ్చేశారు. మేడారం గద్దెల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలిపాడ్ వద్దకు మంత్రి సీతక్క తో పాటు పలువురు అధికారులు ఆయనకు స్వాగతం పలికేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా అన్నా స్వాగతం అంటూ సీతక్క చెప్పడంతో అక్క నీ రాజ్యానికి వచ్చాను అంటూ సీనన్న నవ్వుతూ అన్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు నవ్వుల వాతావరణం వెల్లి విరిసింది. అనంతరం శ్రీనివాస్ రెడ్డి మరియు ఇతర అధికా రులతో కలిసి మొక్కు తీర్చుకునేందుకు గద్దెల ప్రాంగణానికి వెల్లి తలకు సమర్పించే బెల్లంతో తులాభారం వేయించుకు న్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ ఉన్నతాధికారులు కలెక్టర్లు, ఇతర నాయకులు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.