బ్లడ్ డోనర్స్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి చేయూత
తెలంగాణజ్యోతి, ఏటూరునాగారం: ఏటూరునాగారం మండలం శంకరాజుపల్లి గ్రామానికి చెందిన మంతెన మానస, సుమన్ల చిన్న కుమారుడు గగన్ పాము కాటుకి గురై ఎంజి యంలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు.తండ్రి సుమన్ దీన స్థితిలో సహాయం కోరగా ఏటూ రునాగారం బ్లడ్ డోనర్స్ సహాయనిధి ఆధ్వర్యంలో దాతల సహాయంతో రూ. 5 వేల సమాకూర్చి వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్లడ్ డోనర్స్ మహ మ్మద్ మున్నా, కార్య దర్శి మల్యాల పవన్, తాటి నీలాద్రి, పల్నాటి శరత్, దునికి నవీన్, రెడ్డి రోకేష్, తాటి వంశీ, రెడ్డి రామ్, పలక యశ్వంత్, అల్లంల చంటి యాదవ్, అత్కూరి రాంబాబు, అత్కూరి రవి గ్రామస్థులు పాల్గొన్నారు.