చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు చేయూత.

చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు చేయూత.

వెంకటాపురం/వాజేడు, డిసెంబర్22, తెలంగాణ జ్యోతి : వాజేడు మండలంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ, యువతరం యూత్ అసోసి యేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు లైబ్రరీ పుస్తకాలు (ఫ్రీడమ్ ఫైటర్ బుక్స్) శానిటరీ ప్యాడ్స్ లను అందజేశారు. ఈ సందర్భంగా యువ తరం యూత్ అసోసియేషన్ అధ్యక్షులు దశరథం, చేయూత స్వచ్ఛంద సేవ సంస్థ చిడెం సాయి ప్రకాష్ లు హాజరై విద్యార్థులకు అందించారు.అనంతరం కిరణ్ మాట్లాడుతూ విద్యార్థులు ఈ పోటీ ప్రపంచంలో ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని దానికి అనుగుణంగా చదవాలన్నారు. సాయి ప్రకాష్ మాట్లాడుతూ విద్యార్థుల ఉన్నత చదువులకై మాలాంటి స్వచ్ఛంద సంస్థలు మీకు ఎల్లప్పుడూ అండ గా ఉంటాయని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ ఎస్ఓ, టీచర్స్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.