వెంకటాపురం ఏజెన్సీ ప్రాంతంలో భారీ వర్షం

వెంకటాపురం ఏజెన్సీ ప్రాంతంలో భారీ వర్షం

– పల్లప్రాంతాలు జలమయం. 

వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో శనివారం సాయం త్రం ప్రచండ వేగంతో వీచిన గాలులతో పాటు, దిక్కులు పిక్క టిల్లే విధంగా, ప్రళయ గర్జనలతో భారీ వర్షం పడింది. భారీ వర్షం కారణంగా పల్లపు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మారుమూల అటవీ గ్రామాలైన అటవీ ప్రాంతాల్లో పిడుగులు పడ్డట్లు సమాచారం. గత రెండు రోజులుగా బంగాళాఖాతం లో ఏర్పడిన వాయుగుండం కారణంగా వాతావరణ శాఖ భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. దీంతో ఖరీఫ్ వరి పొలాలకు కురుస్తున్న వర్షాలు ఎంతో ప్రయోజనకరంగా ఉం టాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక ప్రధాన వాణిజ్య మిర్చి పంట వేసేందుకు రైతులు గోదావరి లంక భూ ములలో దుక్కులు చేసి మిర్చి మొక్కలను నాటే ప్రయత్నం లో ఉండగా భారీ వర్షం కారణంగా దుక్కులు వర్షపు నీటిని తాగి భూములలో తేమ శాతం పెంచేందుకు ఉపయోగకరం గా ఉంటుందని రైతుల తెలిపారు.భారీ వర్షాల కారణం గా విద్యుత్ సరఫరాకు తరుచూ అంతరాయం ఏర్ఫడుతున్నది.