భూపాలపల్లి జిల్లాకు రేపు భారీ వర్ష సూచన
– కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి జిల్లా ప్రతినిధి, తెలంగాణ జ్యోతి: వాతావ రణ శాఖ సూచన మేరకు మంగళవారం వరకు జిల్లాకు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, నదులు, వాగులు, చెరువులు, వరదలకు ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలు అవసరమైతే తప్ప వర్షపు రోజులలో ప్రయాణం చేయొద్దని, ఇళ్ల నుండి బయటకు రావొద్దని, పశువులను ఆరుబయట మేతకు వదలొద్దని ఆయన సూచించారు. భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం కార్యస్థానాల్లో అందుబాటులో ఉండి పరిస్థితులను పర్య వేక్షణ చేయాలని ఆదేశించారు.