ఘనంగా తెలుగు వ్యవహారిక భాషా దినోత్సవం
వెంకటాపురం నూగూరు, తెలంగాణాజ్యోతి : తెలుగు వ్యవహారిక భాష కోసం దాని అమలు కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు గిడుగు వెంకట రామమూర్తి అని, ఆయన చేసిన కృషి ఫలితంగానే నేడు మన అందరికీ అర్థమయ్యే ఇంటి భాషలో పాఠ్యపుస్తకాలు, దినపత్రికలు చదువుతున్నామని, ప్రముఖ రచయిత, తెలుగు ఉపన్యా సకులు, డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు అన్నారు. గిడుగు రామమూర్తి 161వ జయంతి సందర్భంగా ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో గిడుగు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఆయన సేవలను కొనియాడారు.ఈ సందర్భంగా డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు ఉపన్యాసకులను విద్యార్థిని, విద్యార్థులు శాలువాలతో సత్క రించారు.ఈ కార్యక్రమంలో ఉపన్యాసకులు గజ్జి శ్రీనయ్య, బోదె బోయిన ఆదిలక్ష్మి, బి.సుమన్ , యం.సంధ్య, పి.రోహిత రెడ్డి, కె.రాంబాబు, గోపాల్, కళాశాల విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.