చిన్నబోయినపల్లి లో రామమందిరం నిర్మాణం చేపట్టిన హనుమాన్ భక్తులు.
చిన్నబోయినపల్లి లో రామమందిరం నిర్మాణం చేపట్టిన హనుమాన్ భక్తులు.
తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : మండలంలోని చిన్న బోయిన పల్లి గ్రామ శివారుసర్వే నెంబర్ 14 లో గల 17 గుంటల భూమి లో రామమందిరం నిర్మాణానికి హనుమాన్ భక్తులు, చిన్నబోయినపల్లి గ్రామస్తులు నడుము బిగించారు. ఎన్నో ఏండ్లుగా చిన్నబోయినపల్లిలో దేవాలయం లేక గ్రామ స్తులు ఇబ్బందులు పడుతన్నారని, గ్రామంలో వృధాగా వున్న ప్రభుత్వ భూమిని కబ్జా దారుల బారినుండి కాపాడడంతో పాటుగా గ్రామం లో దేవాలయం లేని లోటు ను తీర్చేందుకు గ్రామస్తులు, హనుమాన్ భక్తులుకలిసి రామాలయ నిర్మాణా నికై పూనుకున్నామని హనుమాన్ భక్తులు తెలిపారు.