మొబైల్స్ పోగొట్టుకున్న బాధితులకు తిరిగి అప్పగింత
తెలంగాణ జ్యోతి/కాళేశ్వరం ప్రతినిధి : మేడారం జాతర దర్శనానికి వెళ్లిన భక్తుల నుండి పలు ప్రాంతాలలో దొంగిలించ బడిన మొబైల్స్ బాధితులకు శుక్రవారం నాగుల సంతోష్ మిత్ర బృందం శుక్రవారం తిరిగి అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి… జాతరలో సమ్మక్క సమయంలో జేబులో చేయి పెట్టి మొబైల్ తీస్తున్న క్రమంలో దొంగ అని గుర్తించి మొత్తం తనిఖీ చేయగా ఉన్న మొబైల్ ను విసిరి పారేశాడు. దొరికిన ఐదు మొబైల్ లను, దొంగను పోలీసులకు అప్ప గించినట్లు సంతోష్ మిత్ర బృందం తెలిపారు. అదేవిధంగా ఆ స్థలంలో మరింత వెతకగా మూడు మొబైల్ దొరికినట్లు, వాటిని ఆన్ చేసి బాధితులకు తెలిపామన్నారు. ఒకరు కాలేశ్వరంలోని మిస్టర్ చాయ్ హోటల్ వద్దకు వచ్చి మొబైల్ తీసుకున్నారని, ఇద్దరు సోమవారం లోపు తీసుకుంటామని తెలిపినట్లు వారు పేర్కొన్నారు. నాగుల సంతోష్ మిత్ర బృందానికి బాధితులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.