చోరీకి గురైన సెల్ ఫోన్స్ బాధితులకు అందజేత
చోరీకి గురైన సెల్ ఫోన్స్ బాధితులకు అందజేత
– ఏ ఎస్ పి శివం ఉపాధ్యాయ
తెలంగాణజ్యోతి, ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూ రునాగారం మండల పరిసరాలలో చోరీకి గురైన, పోగొట్టు కున్న 11 మొబైల్ ఫోన్లను సోమవారం ఏటూరు నాగారం ఏ ఎస్ పి శివం ఉపాధ్యాయ బాధితులకు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ములుగు జిల్లాలో మొబైల్ ఫోన్లో రికవరీ కోసం ప్రత్యేక టీం ఏర్పాటు చేయడం జరిగిం దని గత సంవత్సర కాలంగా చోరీకి గురైన పోగొట్టుకున్న సెల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అందించడం జరిగిందని ఆయ న అన్నారు. మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న దొంగిలించబడిన వెంటనే CEIR పోర్టల్ నందు బ్లాక్ చేసి సంబంధిత పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని సూచించారు. దొంగిలించబడి న మొబైల్స్ ను గుర్తించడంలో CEIR వెబ్సైట్ ఉపయోగపడు తుందన్నారు. CEIR పోర్టల్ ద్వారా సెల్ ఫోన్ లను వెతికి పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన కానిస్టేబుల్ హరీష్, శ్రీనివాస్ లను ఏ ఎస్పీ శివం ఉపాధ్యాయ అభినందించారు.