గుడుంబా పట్టివేత కేసు నమోదు. 

గుడుంబా పట్టివేత కేసు నమోదు. 

వెంకటాపురంనూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వాజేడు మండలం ఘనపురం శివారు వద్ద వాహనాల తనికీ లు చేస్తుండగా ఉదయం అవే గ్రామానికి చెందిన కుమ్మరి గోపిచంద్ ప్రభుత్వం చే నిషేదించబడిన గుడుంబాను తరలిస్తుండగా పట్టుకొని కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.  3 పాలిథిన్ ప్యాకేట్స్ ఒక్కొక్క ప్యాకెట్ లో 15 లీటర్ల చొప్పున మొత్తం 45 లీటర్లు, ఛత్తీస్ ఘడ్ లో గోపీచంద్ కొనుక్కొని ఒక సంచి లో పెట్టుకొని అతని సొంత ఊరు అయిన ఘనపురం లో అమ్ముటకు తీసుకు వస్తుండగా పట్టుకొని అట్టి గుడుంబా సుమారు విలువ రూపాయలు 13,500/- గల దానిని,షైన్ బైక్ విలువ సుమారు రూపాయలు 25000/- గల వాటిని పంచనామా ద్వారా స్వాధీనం చేసుకొని, అట్టి వ్యక్తిని పోలీస్ స్టేషన్ కు తీసుకొనివచ్చి అతని పై కేస్ నమోదు చెసీనట్లు వాజేడు ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “గుడుంబా పట్టివేత కేసు నమోదు. ”

Leave a comment