గుడుంబా పట్టివేత – ఇరువురు అరెస్టు

గుడుంబా పట్టివేత - ఇరువురు అరెస్టు

గుడుంబా పట్టివేత – ఇరువురు అరెస్టు

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని వాజేడు మండలం మండపాక జాతీయ రహదారి 163 పై వాజేడు పోలీసులు ఆదివారం విస్తృతంగా వాహనాలు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనంపై ఇరువురు వ్యక్తులు పోలీసులను చూసి వాహనం వేగం పెంచి పారిపోయేందుకు యత్నింస్తుండగా  పోలీసులు చాకచక్యంగా పట్టుకొని తనిఖీ చేశారు. వారి వద్ద నుండి 200 లీటర్ల ప్రభుత్వ నిషేధిత గుడుంభాను స్వాధీనం చేసుకు న్నారు. స్వాధీనం చేసుకున్న గుడుంబా విలువ సుమారు 80 వేల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. ఈ సంద ర్భంగా ఏ .రవి, ఏ. నాథ్ అనే ఇరువురు వ్యక్తులను అరెస్టు చేసి గుడుంభా తో సహా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వాజేడు సివిల్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రుద్ర హరీష్ మీడియాకి తెలిపారు. తనిఖీల కార్యక్రమంలో వాజేడు సివిల్ మరియు సిఆర్పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.