వెంకటాపురంకు లేవి రైస్ స్టాక్ యార్డ్ మంజూరు
– రైస్ మిల్లును తనిఖీ చేసిన సివిల్ సప్లై జిల్లా మేనేజర్
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల కేంద్రంలో లెవీ రైస్ స్టాక్ యార్డ్ రైస్ ట్రేడింగ్ మిల్లును బుధవారం ములుగు జిల్లా సివిల్ సప్లై జిల్లా మేనేజర్ పరిశీలించారు.వెంకటాపురం మండల కేంద్రం శివారు బీ.సీ. మర్రిగూడెం పంచాయతీ పరిధి లోని శ్రీ రాఘ వేంద్ర రైస్ మిల్ ను లెవీ రైస్ స్టాక్ యార్డ్ ట్రేడీంగ్ రైస్ మిల్లును ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం నిర్మాణం జరిగిందా, యంత్రాలు మరియు విద్యుత్ మోటార్ల అశ్విక శక్తి ఇతర అంశాలపై అదికారుల బృందం పరిశీలిం చింది. ములుగు జిల్లాలో మొత్తం 46 ట్రేడింగ్ లెవీ రైస్ మిల్లులు ప్రభుత్వ అనుమతితో నిర్వహిస్తున్నారు. అయితే వెంకటాపురం, వాజేడు మండలాల్లో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతుల నుండి కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని లెవీ రైస్ స్టాక్ యార్డ్ రైస్ మిల్ కు వెంకటాపురం మండల కేంద్రంలో ట్రేడింగ్ రైస్ మిల్లు కు అనుమతులు వచ్చే అవకాశం వుందని సమాచారం. ఈ మేరకు ప్రభుత్వం నియమ నిబంధనల ప్రకారం రైస్ మిల్ నిర్మాణం, గోదాము పరిసర ప్రాంతాలు తదితర అంశాలపై ములుగు జిల్లా సివిల్ సప్లై జిల్లా మేనేజర్, సివిల్ సప్లై డిప్యూటీ తాసిల్దార్, మరియు వెంకటాపురం మండల తాసిల్దార్ లక్ష్మీరాజయ్య పరిశీలించారు . అలాగే రైస్ మిల్లు యజమాని అయిన కొమ్మనా పల్లి వెంకటేశ్వరావు నుండి పలు అంశాలపై ట్రేడింగ్ రైస్ మిల్లులో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అలాగే సంబం ధిత అనుమతి పత్రాలు దాఖలు చేయాలని, ప్రభుత్వ పర మైన లెవి రైస్ స్టాక్ యార్డు అనుమతులు మంజూరు చేయ డం జరుగుతుందని, ఈ సందర్భంగా సివిల్ సప్లై జిల్లా మేనే జర్ ట్రేడింగ్ రైస్ మిల్ యజమాని అయిన కొమ్మనపల్లి వెంకటేశ్వరరావు కు తెలిపారు. వెంకటాపురంలో లెవీ రైస్ స్టాక్ యార్డు మిల్ ను ప్రభుత్వపరంగా గిరిజన ప్రాంతంలో పండిన వరి ధాన్యం ను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నుండి ఈ మిల్ కు తరలించే అవకాశం ఉందని, దానివల్ల ప్రభు త్వానికి రవాణా చార్జీలు తగ్గే అవకాశం ఉందని, స్థానికంగా పండించే వరి ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రం నుండి స్థానికంగా ఉండే లెవి రైస్ స్టాక్ యార్డు ట్రేడింగ్ రైస్ మిల్లుకు తరలించడం వల్ల ప్రభుత్వానికి రవాణా చార్జీలు తగ్గడంతో పాటు, రైతులకు మేలు జరిగే అవకాశం ఉందని, వెంకటాపు రం,వాజేడు మండలాల,గిరిజన, గిరిజనేతర రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నది.