ఘనంగా గోదావరి నది హారతి

Written by telangana jyothi

Published on:

ఘనంగా గోదావరి నది హారతి

కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం క్షేత్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ కమీషనర్ హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు ప్రతి నెల పౌర్ణమి రోజున గోదావరి నదీ హారతి కార్యక్రమం నిర్వహించుట జరుగుచున్నది. అందులో భాగంగా ఈరోజు ముఖ్య అర్చకులు పనకంటి ఫణీంద్ర శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చక స్వాములు శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి దేవస్థానం నుండి మంగళ వాయిద్యాలు నడుమ భక్తులతో త్రివేణి సంగమ తీరానికి చేరుకున్న అర్చక బృందం వేద మంత్రోచ్ఛారణాల తో గోదావరి నదీ హారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెంట్ బుర్రి శ్రీనివాస్, మాజీ ధర్మకర్త శ్యాంసుందర్ దేవుడా, దేవస్థానం సిబ్బంది, కాలేశ్వరం గ్రామస్తులు ,భక్తులు, మహిళలు, పాల్గొన్నారు.

Leave a comment