ఘనంగా బాలల దినోత్సవం
తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం : మండలంలోని చింత గూడెం ప్రాథమిక పాఠశాలలో జోహార్ లాల్ నెహ్రూ జయంతి ని పురస్కరించుకుని గురువారం బాలల దినోత్సవాన్ని ఘనం గా నిర్వహించారు. ఈ సమావేశానికి పేరెంట్స్ స్కూల్ ప్రిన్సి పాల్ కోరకట్ల రవీందర్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ శ్రీమతి గోస్కుల సారక్క అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భం గా ప్రధానోపాధ్యాయుడు రవీందర్ మాట్లాడుతూ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సేవల గురించి విద్యార్థులు విద్యార్థు లకు వివరించారు. పాఠశాలలో పాటల పోటీలు నిర్వహించ మని. స్టూడెంట్ పేరెంట్ టీచర్ మీటింగ్‌లో భాగంగా, తల్లిదండ్రులు పిల్లలతో సమయాన్ని కేటాయించాలన్నారు. పిల్లలను ఆడనివ్వండి – పెరుగుతున్న వయస్సులో ఆటలు చాలా ముఖ్యమైనవి, కోపంతో స్పందించవద్దని, ప్రశాంతంగా ఆలోచించి స్పందించాలన్నారు. సంతోషకరమైన బాల్యాన్ని అందించి, ఎజెండా అంశాలపై చర్చించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పి.సతీష్ కుమార్ ఆర్ రాజు, ఐలమ్మ, తల్లిదండ్రులు పాల్గొన్నారు.