ఘనంగా సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలు

ఘనంగా సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలు
తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం : మండలంలోని ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో సావిత్రిబాయి పూలే 194 జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యా యులు పిజిహెచ్ఎం దయాసాగర్ సభాధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం జాతీయ కన్వీనర్ పొదెం కృష్ణ ప్రసాద్ హాజరయ్యారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే మహారాష్ట్ర లోని సత్తారా జిల్లాలో నయాగావ్ అనే గ్రామంలో 1831 జనవరి 3న ఒక రైతు కుటుంబంలో జన్మించారన్నారు. వీరు మున్నూ రు కాపునకు చెందినవారని, ఆమె తన 9వ ఏటా 12 ఏళ్ల జ్యోతిరావు పూలే 1840 లో వివాహమాడిందన్నారు. నిరక్షరాలి గా ఉన్న ఆమెకు భర్త జ్యోతిరావు పూలే మొదటి గురువని, జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతోనే ఇంట్లోనే అక్ష రాభ్యాసం చేసి విద్యావంతు రాలైందన్నారు. హామీదానగర్లో ఉపాధ్యాయ శిక్షణ పొంది 1848లో భర్త జ్యోతిరావుతో కలిసి క్రింది కులాల బాలికల కోసం పూణేలో మొదటి పాఠశాలను ప్రారంభించింది. ఈ పాఠ శాల నడపడం ఉన్నత అగ్రవర్ణాలకు నచ్చలేదని, దీంతో ఆమెపై వేధింపులకు భౌతికదాడులకు పూనుకున్నారన్నారు. పాఠశాల కు నడిచే దారిలో ఆమెపై బురద జల్లడం, రాళ్లు విసరడం, అసభ్య పదజాలాన్ని వాడటం వంటివి చేశారన్నారు. సావిత్రి బాయి పూలే భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి, కులమత బేధాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించి న ప్రేమ స్వరూపిణని, ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె తన భర్తతో కలిసి జనవరి 1న పూణేలో మొట్టమొదటిగా బాలికల పాఠశాలను ప్రారంభించింది. కుల వ్యవస్థకు కుల వ్యవస్థకు పితృ సామ్యానికి వ్యతిరేకంగా శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారన్నారు. ఆమె ఆశలు మరువలేని అని కొనియాడారు. జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా కాంప్లెక్స్ పరిధి లోని ఆశ్రమ ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యా యురాలు సునీతను సన్మానించారు. ఈకార్యక్రమంలో పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యా యులు, విద్యార్థులు పాల్గొన్నారు.